Apple Confirms M4 Macs Launch: యాపిల్ లవర్స్‌కు గుడ్‌న్యూస్. టెక్ దిగ్గజం యాపిల్ తన కొత్త ప్రొడక్ట్స్‌ను వచ్చే వారం లాంచ్ చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు అక్టోబరు 28వ తేదీ సోమవారం నుంచి మార్కెట్లోకి కంపెనీ నుంచి పెద్ద ఎత్తున అనౌన్స్మ్మెంట్స్ వస్తాయని ప్రకటించింది. అంటే యాపిల్ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న M4 చిప్‌తో Apple Macbook Pro, iMacలను లాంచ్ చేసే అవకాశం ఉంది.
గత కొంతకాలంగా యాపిల్ ఈ ప్రొడక్ట్స్‌ను రిలీజ్ చేస్తుందనే పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో ఐప్యాడ్ ప్రోతో M4 చిప్‌ను పరిచయం చేశారు. ఈ క్రమంలో ఇప్పుడు కొత్త Mac మోడల్స్‌లో కూడా ఈ చిప్‌ని చూడాలని యాపిల్ ప్రియులు ఆశిస్తున్నారు. ఇది యాపిల్ ఇంటెలిజెన్స్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ కొత్త ప్రాసెసర్‌లు ఏఐ టాస్క్‌లను మరింత వేగవంతం చేసే అవకాశం ఉంది.
Mac (😉) your calendars! We have an exciting week of announcements ahead, starting on Monday morning. Stay tuned… pic.twitter.com/YnoCYkZq6c
— Greg Joswiak (@gregjoz) October 24, 2024
వీటితో పాటు యాపిల్ కొత్త Mac Mini, యాక్సెసరీస్‌ను కూడా లాంచ్ చేసే అవకాశం ఉంది. అంతేకాక కొత్త MacBook Airను కూడా పరిచయం చేయొచ్చు. అయితే కంపెనీ ఈసారి తన అతిపెద్ద కీనోట్ ఈవెంట్‌ను ప్లాన్ చేయట్లేదు. ఈ ప్రొడక్ట్స్‌ను ఆన్లైన్లో ప్రెస్ రిలీజ్, వీడియో రిలీజ్ ద్వారా పరిచయం చేస్తుందని తెలుస్తోంది. గతవారం ఐప్యాడ్ మినీ 7ను కూడా ఆన్లైన్ ఈవెంట్లోనే లాంచ్ చేసింది. ఇదే రీతిలో M4 చిప్‌తో పనిచేసే iMac, MacBook Pro, USB-C యాక్సెసరీస్‌తో Mac Miniని కూడా తీసుకురానున్నట్లు సమాచారం.
ఐఫోన్లో సరికొత్త ఫీచర్స్: కాగా యాపిల్ గురువారం తన ఏఐ సాఫ్ట్‌వేర్ బీటా వెర్షన్ ప్రివ్యూని రిలీజ్ చేసింది. యాపిల్ ఇంటెలిజెన్స్‌లో ChatGPT, ఇమేజ్-జనరేషన్ వంటి సరికొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. iOS 18.1లో భాగంగా వచ్చే వారం ప్రారంభంలో యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ల మొదటి వేవ్‌ను విడుదల చేయనుంది. యాపిల్ తన ఏఐ ఫీచర్లను ప్రకటించిన సమయంలో కేవలం కొన్ని ఐఫోన్, ఐప్యాడ్, Mac మోడల్స్‌కు మాత్రమే ఈ సాఫ్ట్‌వేర్ అందుబాటులో ఉండేది. అయితే ఇప్పుడు కొత్తగా లాంచ్ అయిన మిని ఐప్యాడ్‌తో సహా అన్ని Macs యాపిల్ ఇంటెలిజెన్స్‌కు సపోర్ట్ చేస్తున్నాయి. దీనిపై మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
కొంగొత్త ఫీచర్లతో కాన్వా డ్రీమ్ ల్యాబ్- ఇకపై హై క్వాలిటీ ఇమేజెస్‌తో పండగే..!
దేశంలో ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్- భారీ పెట్టుబడులతో ఇన్నోవేషన్ సెంటర్ కూడా..