Indian Forces Chiefs : భారత సైన్యం చరిత్రలో తొలిసారిగా అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ఇద్దరు మిత్రులు ఇండియన్ ఆర్మీ, నేవీకి చీఫ్‌లుగా నియమితులయ్యారు. ఒకప్పుడు సహవిద్యార్థులైన లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి ప్రస్తుతం భారత సైన్యం, నావికాదళానికి చీఫ్‌లుగా ఎంపికయ్యారు. మధ్యప్రదేశ్‌లోని రేవా సైనిక్ స్కూల్లో వీరిద్దరూ 1970లో 5వ తరగతి నుంచి కలిసి చదువుకున్నారు. వీరిద్దరూ స్కూల్ డేస్ నుంచి మంచి స్నేహితులు. సైన్యంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్నప్పటికీ, వారు ఎల్లప్పుడూ టచ్‌లో ఉండేవారు. క్లాస్ మేట్స్ ఇద్దరి నియామకాలు కూడా దాదాపు రెండు నెలల వ్యవధిలోనే జరగడం గమనార్హం. మరోవైపు, ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే ఆదివారం నేషనల్ వార్ మెమోరియల్ వద్ద యుద్ధ అమరవీరులకు నివాళులర్పించి పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంంలో లెఫ్టినెంట్ జనరల్‌గా ఉపేంద్ర ద్వివేది బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఆర్మీ, నేవీ చీఫ్‌లుగా క్లాస్ మేట్స్- దేశ చరిత్రలో ఫస్ట్ టైమ్
Published : Jun 30, 2024, 10:10 AM IST