ETV Bharat / snippets

మహారాష్ట్రలో 99మందితో బీజేపీ ఫస్ట్ లిస్ట్ - నాగ్​పుర్ సౌత్​వెస్ట్​ నుంచి దేవేంద్ర ఫడణవీస్ పోటీ

Maharashtra Assembly Polls BJP List
Maharashtra Assembly Polls BJP List (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 20, 2024, 4:44 PM IST

Maharashtra Assembly Polls BJP List : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 99మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను భారతీయ జనతాపార్టీ-బీజేపీ విడుదల చేసింది. మహారాష్ట్రలో- బీజేపీ అగ్రనేత, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ నాగ్​పుర్ సౌత్​వెస్ట్ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ భావన్ కులే కామఠీ నుంచి బరిలో నిలిచారు. మంత్రులు గిరిష్ మహాజన్, సుధీర్ ముంగటివర్ తదితరులు జాబితాలో స్థానం దక్కించుకున్నారు. మహారాష్ట్ర శాసనసభకు నవంబర్ 20న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో 288 అసెంబ్లీ స్థానాలున్నాయి.

మరోవైపు కేవలం ఐదు సీట్లే కావాలని బీజేపీ నాయకులతో మాట్లాడినట్లు కేంద్ర సహాయ మంత్రి, రిపబ్లిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు రాందాస్‌ ఆఠవాలే ఉన్నారు. అయితే అధికారంలో రాగానే ఒక మంత్రి పదవి ఇవ్వాలని కోరినట్లు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.