Telangana Tourism Somasila Package: నేటి బిజీ బిజీ లైఫ్‌లో.. వీకెండ్ వచ్చిందంటే చాలు చాలా మంది ఫ్యామిలీతో సరదాగా గడిపేందుకు ఫ్లాన్ చేసుకుంటుంటారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ దగ్గర్లో ఉండే టూరిస్టు స్పాట్‌ల కోసం వెతుకుతుంటారు. అలా నగరానికి దగ్గరగా ఉండే టూరిస్టు స్పాట్‌లలో తెలంగాణ మినీ మాల్దీవులుగా పేరుగాంచిన సోమశిల ఒకటి. నగరానికి దగ్గరగా ఉన్న ఈ ప్రాంతానికి వెళ్లేందుకు పర్యాటకలు క్యూ కడుతుంటారు. మరి మీరు కూడా సోమశిల వెళ్లి ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్ చెబుతోంది తెలంగాణ టూరిజం. సోమశిల అందాలను చూసేందుకు వీలుగా ఓ ప్యాకేజీ తీసుకొచ్చింది. దీనికి సంబంధిచిన పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..
తెలంగాణ టూరిజం "హైదరాబాద్-శ్రీశైలం- సోమశిల-హైదరాబాద్(రోడ్ కమ్ రివర్‌క్రూజ్ టూర్)" పేరుతో ప్యాకేజీ ఆపరేట్ చేస్తోంది. ప్రతి శని, ఆదివారాల్లో ఈ టూర్ ఉంటుంది. మొత్తం రెండు రోజుల పాటు ఈ టూర్ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ నుంచి బస్సు ద్వారా జర్నీ ఉంటుంది. ప్రయాణ వివరాలు చూస్తే..
- మొదటి రోజు ఉదయం తొమ్మిది గంటలకు బషీర్‌బాగ్‌లోని సీఆర్‌ఓ కార్యాలయం నుంచి శ్రీశైలానికి బస్సు జర్నీ స్టార్ట్ అవుతుంది. శ్రీశైలం చేరుకొని హోటల్‌లో చెకిన్ అవుతారు.
- ఆ తర్వాత శ్రీభమరాంభ మల్లిఖార్జున స్వామి వారి దర్శనం ఉంటుంది. ఆ సాయంత్రం వీలుంటే డ్యామ్ సందర్శన ఉంటుంది. ఇక ఆ రాత్రికి శ్రీశైలంలో బస చేయాల్సి ఉంటుంది.
- రెండో రోజు ఉదయం తొమ్మిది గంటలకు శ్రీశైలం నుంచి సోమశిలకు ప్రయాణమవుతారు. అయితే ఇక్కడ జర్నీ శ్రీశైలం నుంచి సోమశిల వరకు క్రూజ్ జర్నీ(బోట్) ఉంటుంది. ఇక సాయంత్రం వరకు అక్కడ ఎంజాయ్ చేస్తారు.
- సాయంత్రం 5 గంటలకు సోమశిల నుంచి హైదరాబాద్‌కు రిటర్న్ జర్నీ స్టార్ట్ అవుతుంది. రాత్రి 9 గంటలకు భాగ్యనగరానికి చేరుకోవడంతో టూర్ పూర్తవుతుంది.
ఇతర వివరాలు చూస్తే:
- రెండు రోజుల ఈ టూర్ కోసం పెద్దలకు రూ.4999, పిల్లలకు 3,600గా ప్యాకేజీ ధరలు నిర్ణయించారు.
- హైదరాబాద్ నుంచి నాన్ ఏసీ బస్సు ద్వారా జర్నీ ఉంటుంది.
- శ్రీశైలంలో నాన్ ఏసీ హోటల్‌లో రాత్రికి బస ఉంటుంది.
- శ్రీశైలం నుంచి సోమశిలకు నాన్ ఏసీ బోట్ జర్నీ
- బోట్ జర్నీలో మధ్యాహ్న భోజనం అందిస్తారు.
- ఈ ప్యాకేజీకి సంబంధించిన ఇతర వివరాలు, బుకింగ్ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
తెలంగాణ టూరిజం వన్డే ప్యాకేజీ - కేవలం రూ.1500 టికెట్‌తో జోగులాంబ, అంజన్న దర్శనం, ఇంకా మరెన్నో!
"నాగార్జున సాగర్" టూర్ - కేవలం రూ.800లకే తెలంగాణ టూరిజం సూపర్ ప్యాకేజీ!
ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తున్న అనంతగిరి అందాలు - సెలవుల్లో వెళ్లాల్సిందే మరి