IND vs NZ 2nd Test 2024: పుణె వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ 259 పరుగులకు కుప్పకూలింది. ఓపెనర్ డేవాన్ కాన్వే (76 పరుగులు; 141 బంతుల్లో 11x4), రచిన్ రవీంద్ర (65 పరుగులు; 105 బంతుల్లో 5x4, 1x6) హాఫ్ సెంచరీలు సాధించారు. స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ కివీస్ పతనాన్ని శాసించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లతో అదరగొట్టాడు. మరోవైపు సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 3 వికెట్లు దక్కించుకున్నాడు.
టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ 7వ ఓవర్లోనే ఓపెనర్ టామ్ లేథమ్ (15 పరుగులు) పెవిలియన్ చేరాడు. అశ్విన్ అతడిని ఎల్బీడబ్ల్యూగా వెనక్కిపంపాడు. అయినప్పటికీ కివీస్ త్వరగా పుంజుకుంది. మరో ఓపెనర్ కాన్వే, యంగ్ బ్యాటర్ రచిన్ రవీంద్రతో మంచి పార్ట్నర్షిప్ కొనసాగించాడు. దీంతో న్యూజిలాండ్ 196-3తో పటిష్ఠ స్థితిలోనే నిలిచింది.
ఇక మరోసారి కివీస్ భారీ స్కోర్ సాధించే దిశగా వెళ్తున్న సమయంలో సుందర్ మ్యాజిక్ చేశాడు. 65 వ్యక్తిగత పరుగుల వద్ద రచిన్‌ను క్లీన్‌బౌల్డ్ చేసి భారత్‌కు బ్రేక్ ఇచ్చాడు. అలాగే కొద్ది సేపటికే వికెట్ కీపర్ టామ్ బ్లండెల్ (3 పరుగులు)ను కూడా సుందర్ పెవిలియన్ చేర్చాడు. దీంతో కివీస్ 201-5కు చేరింది. ఇక స్పిన్‌కు సహకరిస్తున్న పిచ్‌పై సుందర్ ఆ తర్వాత కూడా అదిరే ప్రదర్శనతో టపటపా వికెట్లు కూల్చాడు. సుందర్ దెబ్బకు కివీస్ 62 పరుగుల వ్యవధిలో చివరి 7 వికెట్లు కోల్పోయింది. కాగా, ఈ ఇన్నింగ్స్‌లో మొత్తం 10 వికెట్లు స్పిన్నర్లకే (సుందర్ 7, అశ్విన్ 3) దక్కడం విశేషం.
FIFER! 👏 👏
— BCCI (@BCCI) October 24, 2024
Outstanding stuff this is from Washington Sundar! 🙌 🙌
His maiden 5⃣-wicket haul in Test cricket 👍 👍
Live ▶️ https://t.co/YVjSnKCtlI#TeamIndia | #INDvNZ | @IDFCFIRSTBank pic.twitter.com/BPt6tPmE5Q
భారత్‌కు షాక్
తొలి రోజు ఆఖరి సెషన్లో ఫస్ట్ ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమ్ఇండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ (0) డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. పేసర్ టిమ్ సౌథీ ఇన్‌స్వింగర్‌కు రోహిత్ క్లీన్ బౌల్డయ్యాడు. దీంతో భారత్ 1 పరుగుకే తొలి వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం టీమ్ఇండియా 16-1 స్కోర్‌తో ఉంది. క్రీజులో యశస్వీ జైస్వాల్ (6), శుభ్‌మన్ గిల్ (10) ఉన్నారు.
Stumps on Day 1 of the 2nd Test.#TeamIndia trail by 243 runs in the first innings.
— BCCI (@BCCI) October 24, 2024
Scorecard - https://t.co/3vf9Bwzgcd… #INDvNZ @IDFCFIRSTBank pic.twitter.com/diCyEeghM4
రెస్ట్ కాదు - సిరాజ్‌ను రెండో టెస్ట్‌లో తీసుకోకపోవడానికి అసలు కారణమిదే!
న్యూజిలాండ్‌తో రెండో టెస్ట్ - WTCలో అశ్విన్ అదిరే రికార్డ్