ETV Bharat / business

గోల్డ్ VS డైమండ్- ఇన్వెస్ట్ చేసేందుకు ఏది బెటర్? ఎందులో రిస్క్ తక్కువ?

బంగారం, వజ్రాలలో దేనిలో ఇన్వెస్ట్ చేయడం బెటర్?

Gold Vs Diamond Best Investment
Gold Vs Diamond Best Investment (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : 2 hours ago

Gold Vs Diamond Best Investment : భారతీయులు ఎక్కువగా బంగారం, వజ్రాభరణాలను ఉపయోగిస్తుంటారు. వీటిని విలువైన ఆస్తులుగా పరిగణిస్తారు. అలాగే పసిడి, డైమండ్లను పెట్టుబడి సాధనాలుగా భావిస్తారు. అందుకే ఈ స్టోరీలో బంగారం, వజ్రాలలో దేనిలో పెట్టుబడులు పెట్టడం మంచిది? ఎందులో రిస్క్ తక్కువగా ఉంటుంది? తదితర విషయాలు తెలుసుకుందాం.

పూర్వకాలం నుంచి బంగారం వాడకం
బంగారాన్ని సంపదకు చిహ్నంగా భావిస్తారు భారతీయులు. పూర్వకాలం నుంచి పసిడిని కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. అలాగే పసిడిని మంచి పెట్టుబడి సాధనంగా ఉపయోగించుకుంటారు. అయితే, బంగారంతో పోలిస్తే భారత్​లో వజ్రాలను ప్రత్యేకమైన పెట్టుబడిగా చూస్తారు.

ఈజీగా కొనుగోలు
బంగారాన్ని ఈజీగా కొనుగోలు, అమ్మకం చేయవచ్చు. అలాగే బంగారం ధర ద్రవ్యోల్బణం, ఆర్థిక పరిస్థితులు, డిమాండ్, సరఫరా వంటి అనేక అంశాలపై ఆధారపడుతుంది. మరోవైపు, వజ్రాల పరిశ్రమలో కొనుగోలుదారుడు, విక్రేత మధ్య చాలా మంది మధ్యవర్తులు ఉంటారు. అందుకే డైమండ్లను కొనుగోలు చేయడం కాస్త సవాల్​తో కూడుకున్న పని. అలాగే వజ్రాల ధర సాధారణంగా ఫ్యాషన్, పరిశ్రమ పరిస్థితులు, వినియోగదారుల డిమాండ్ వంటి అంశాలపై ఆధారపడుతుంది.

స్థిరమైన మార్కెట్
బంగారానికి ప్రపంచవ్యాప్తంగా స్థిరమైన మార్కెట్ ఉంది. దీంతో అధిక మొత్తంలో బంగారం దిగుమతి అవుతుంది. అందుకే బంగారాన్ని కొనడం, అమ్మడం చాలా సులువైన పని. వజ్రాల విలువ స్వచ్ఛత, రంగు, క్యారెట్ల వంటివాటిపై ఆధారపడి ఉంటుంది. వీటిని క్రయవిక్రయాలు కాస్త కష్టమనే చెప్పాలి.

ద్రవ్యోల్బణం, ఆర్థిక మాంద్యంలోనూ
ఇతర ఆస్తుల మాదిరిగా కాకుండా బంగారం విలువ స్థిరంగా ఉంటుంది. ఆర్థిక మాంద్యం సమయంలో కూడా పెరుగుతుంది. పసిడిలో పెట్టుబడులు ద్రవ్యోల్బణం, మార్కెట్ల అస్థిరత సమయంలోనూ సేఫ్ అని చెప్పొచ్చు. మరోవైపు, వజ్రాల ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. ద్రవ్యోల్బణం సమయంలో డైమండ్లలో పెట్టుబడులు బంగారంతో పోలిస్తే అంత రక్షణగా ఉండవు.

ధరను బట్టి పసిడివైపునకు మొగ్గు
దీర్ఘకాలిక లాభాలను ఆశించేవారు వజ్రాలతో పోలిస్తే బంగారంలో ఎక్కువ పెట్టుబడులు పెడతారు. ఎందుకంటే బంగారం ధరలు హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ, కాలక్రమేణా దాని విలువ పెరుగుతుందనే నమ్మకం. అయితే బంగారంతో వజ్రాల రేటు అంత స్థాయిలో పెరగకపోవచ్చు.

అధిక పెట్టుబడి మార్గాలు
ఫిజికల్ గోల్డ్, గోల్డ్ ఈటీఎఫ్​లు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్లు, సావరిన్ గోల్డ్ బాండ్లు వంటి వివిధ పెట్టుబడి సాధనాల ద్వారా పసిడిలో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఫిడికల్ డైమండ్స్, డైమండ్ ఫండ్స్​లో మాత్రమే వజ్రాలలో పెట్టుబడులు పెట్టొచ్చు.

చారిత్రక నేపథ్యం
బంగారానికి అపారమైన చారిత్రక ప్రాముఖ్యత ఉంది. పురాతన కాలం నుంచి దీన్ని కరెన్సీగా ఉపయోగించుకుంటున్నారు. సంపద, శ్రేయస్సుకు చిహ్నంగా భావిస్తున్నారు. మరోవైపు, వజ్రాలు ప్రధానంగా అందం,లగ్జరీకి సంబంధించినవిగా పరిగణిస్తారు.

వీటిని బట్టి ధర
వజ్రాల ధర క్యారెట్, కట్, ప్యూరిటీ, కలర్ ఆధారంగా ఉంటుంది. అయితే బంగారం, వజ్రాలకు దేని విలువ దానికే ఉంటుంది. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని పెట్టుబడులు పెట్టడం మంచిది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.