ETV Bharat / spiritual

'శుక్రవారం ప్రపోజ్ చేస్తే లవ్ పక్కా సక్సెస్ అవుతుంది'- కానీ ఆ టైమ్​లోనే చేయాలట!

-శుక్రవారం ఆ సమయంలో ఆభరణాలు, గాజులు కొంటే మంచిదట! -నీటిలో ఇవి కలిపి స్నానం చేస్తే దరిద్రం పోతుందంటున్న జ్యోతిష్య నిపుణులు

Friday Remedies to Become Lucky
Friday Remedies to Become Lucky (ETV Bharat)
author img

By ETV Bharat Features Team

Published : 3 hours ago

Friday Remedies to Become Lucky: శుక్రవారాన్ని లక్ష్మీ దేవత అనుగ్రహించే రోజుగా భావించి చాలా మంది పూజలు చేస్తుంటారు. ఈ సమయంలో కొన్ని వస్తువులు కొనుగోలు చేస్తే అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుందని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజ్ కిరణ్ కుమార్ చెబుతున్నారు. అయితే, శుక్రవారం రోజు చేసే కొన్ని తప్పుల వల్ల దరిద్రం కూడా చుట్టుకుంటుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రోజు చేయాల్సిన పనులు ఏంటి? చేయకూడనివి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

శుక్రవారం రోజు ఎవరైనా సరే.. లవ్ ప్రపోజల్ చేస్తే వంద శాతం సక్సెస్ అయ్యే అవకాశం ఉందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోందని కిరణ్ కుమార్ అంటున్నారు. శుక్రవారం ఉదయం 6 నుంచి 7, మధ్యాహ్నం 1 నుంచి 2, రాత్రి 8 నుంచి 9 గంటల మధ్య శుక్ర హోరు ఉంటుందని.. ఈ సమయంలో లవ్ ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేసే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని వివరించారు. అలాగే శుక్రవారం విలాస వస్తువులు కొనుగోలు చేస్తే చాలా మంచిందని తెలిపారు. నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించడానికి శుక్రవారం అనుకూలమైన రోజని అంటున్నారు. బంగారం కొనుగోలు చేయడానికి శుక్రవారం చాలా మంచిదని చెబుతున్నారు. ఇంకా శుక్ర హోరు సమయంలో నూతన అభరణాలు, గాజులు, పువ్వులు, పండ్లు, సెంట్ సీసాల లాంటి డెకరేటివ్ వస్తువులు కొనుక్కుంటే లక్ష్మీ కటాక్షం విశేషంగా కలుగుతుందన్నారు.

"శుక్రవారం ఉదయం 6 -7 గంటల మధ్యలో ఉప్పు కొంటే చాలా మంచిది. ఒక గాజు గిన్నెలో ఉప్పు, పసుపు, కుంకుమ కలిపి పూజ గదిలో ఉంచితే శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. వ్యవసాయ దారులు కర్జూర, రేగి, సీతాఫలం, బత్తాయి, నారింజ లాంటి పంటలు శుక్రవారం వేయడం మంచిది. ఇలా చేస్తే అదృష్టం బాగా కలిసివస్తుంది. శుక్రవారం మహిళలతో పరిచయం ఏర్పరచుకుంటే అవి.. బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తాయి. భార్యభర్తల మధ్య నెలకొన్న విభేధాలు తొలగిపోవడానికి చేసే ప్రయత్నాలకూ శుక్రవారం బాగా కలిసివస్తుంది."

-మాచిరాజు కిరణ్ కుమార్, జ్యోతిష్య నిపుణులు

అలాగే సినీ, టీవీ, మీడియా రంగాల్లో అవకాశాల కోసం చూసేవారు.. శుక్రవారం ప్రయత్నిస్తే కచ్చితంగా విజయవంతం అవుతాయన్నారు కిరణ్ కుమార్. అన్న ప్రాసన, నామకరణం, అక్షరాభ్యాసం, సీమంతం, చెవులు కుట్టించడం వంటి కార్యక్రమాలు శుక్రవారం చేసుకోవాలని వివరించారు. శుక్రవారం రోజు పెళ్లిళ్లు చేసుకున్న ఉత్తమ ఫలితాలు కలుగుతాయని అంటున్నారు. కానీ శుక్రవారం రోజు ఆడపిల్లను అత్తవారింటికి ఎట్టి పరిస్థితుల్లో పంపిచకూడదని చెబుతున్నారు. ఇంకా శుక్రవారం రోజు ఆడవారు జుట్టు విరబూసుకుని ఎడవకూడదని.. అలా చేస్తే దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుందని హెచ్చరించారు. శుక్రవారం రోజు శుక్ర హోరు ఉన్న సమయంలో లక్ష్మీ దేవికి సంబంధించిన ఏ నామం చదివినా సరే.. లక్షీ కటాక్షం విశేషంగా కలుగుతుందని అంటున్నారు. ప్రధానంగా శుక్రవారం రోజు స్నానం చేసే సమయంలో నీటిలో కొద్దిగా కుంకుమ పువ్వు, సెంటు, ఉసిరిక పవ్వు నీటిలో కలిపి 5 నిమిషాల తర్వాత వాటితో స్నానం చేస్తే దరిద్రం పోయి లక్ష్మీ కటాక్షం త్వరగా పొందవచ్చని కిరణ్ కుమార్ వివరించారు.

ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ధన త్రయోదశి ఏ రోజున వచ్చింది? - లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం పొందడానికి ఎలా పూజించాలి?

గురువారం జస్ట్ "రూపాయి కాయిన్"​తో ఇలా చేయండి! - లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంట డబ్బుల వర్షమే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.