ETV Bharat / business

క్రెడిట్​ కార్డు ట్రాన్సాక్షన్స్​పై అనధికార ఛార్జీలు? మీ సమస్యను ఇలా సెటిల్​ చేసుకోవచ్చు! - CREDIT CARD DISPUTES

క్రెడిట్​ కార్డు సంస్థలు లావాదేవీలపై అనధికార ఛార్జీలు వసూలు చేస్తున్నాయా?- అయితే సమస్య ఈ విధంగా పరిష్కరించుకోండి?

How To Resolve Credit Card Disputes
How To Resolve Credit Card Disputes (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 24, 2024, 4:13 PM IST

How To Resolve Credit Card Disputes : ప్రస్తుతం క్రెడిట్‌ కార్డులు చాలా మందికి రోజువారీ ఆర్థిక అలవాట్లలో భాగంగా మారాయి. అయితే క్రెడిట్​ కార్డు బకాయిలు తిరిగి చెల్లించే క్రమంలో కొన్నిసార్లు సమస్యలు ఏర్పడతాయి. అనధికార ఛార్జీలు, తప్పుడు బిల్లింగ్​ లెక్కలు, చెప్పిన విధంగా సేవలు అందలేపోవడం వంటి సమస్యలు వస్తాయి. దీంతో వినియోగదారులు అసహనానికి గురవుతారు. ఈ విషయమై క్రెడిట్ సంస్థను చెల్లింపుదారుడు ప్రశ్నిస్తే అది క్రెడిట్​ కార్డు డిస్ప్యూట్​కు(Credit Card Disputes) దారితీస్తుంది.

క్రెడిట్ కార్డుల ద్వారా చేసే ఆన్​లైన్ ఖర్చులు 2024 ఏప్రిల్​ నాటికి రూ.లక్ష కోట్లుకు చేరుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దాంతోపాటు 2022 నుంచి క్రెడిట్​ కార్డు డిస్ప్యూట్​లలోనూ 20శాతం పెరుగుదల నమోదైందని వెల్లడించాయి. క్రెడిట్​ కార్డుల వినియోగం పెరుగుతున్న తరుణంలో ఇలాంటి డిస్ప్యూట్​లు​ తలెత్తడం అనివార్యం అని, కాకపోతే దాన్ని మేనేజ్​ చేయొచ్చని నిపుణులు చెబుతున్నారు.

సాధారణంగా, క్రెడిట్​ కార్డు డిస్ప్యూట్​లు తలెత్తినప్పుడు వినియోగదారులు- కార్డు జారీ చేసే సంస్థను సంప్రదిస్తారు. వారి సమస్యను తెలియజేస్తారు. వారు చేసిన క్లెయిమ్​ను సదరు క్రెడిట్ కార్డు సంస్థ పరిశీలించి, అవసరమైతే అదనపు సమాచారాన్ని అడుగుతారు. అయితే వినియోగదారుడి క్లెయిమ్​ నిజమైనదే అని గుర్తిస్తే, ఆ మొత్తాన్ని వారి ఖాతాలో జమ చేస్తారు. ఈ నేపథ్యంలో క్రెడిట్ కార్డు డిస్ప్యూట్​లను ఎప్పుడు, ఎలా లేవనెత్తవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

క్రెడిట్​ కార్డు డిస్ప్యూట్​లు ఎప్పుడు లేవనెత్తాలి?

  • అనధికార ఛార్జీలు : క్రెడిట్ కార్డు బకాయిలు చెల్లించేటప్పుడు అనధికార ఛార్జీలు గుర్తిస్తే వెంటనే సదరు క్రెడిట్ సంస్థకు తెలియజేయాలి
  • బిల్లింగ్ తప్పులు : మీ స్టేట్​మెంట్లలో డూప్లికేట్​ ఛార్జీలు, తప్పుడు మొత్తాలు ఉన్నాయేమో ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి. ఇలాంటివి ఏమైనా ఉంటే వెంటనే క్రెడిట్ సంస్థను ప్రశ్నించాలి
  • వస్తుసేవల డిస్ప్యూట్​లు : క్రెడిట్​ కార్డు సంస్థ ప్రామిస్​ చేసిన విధంగా సేవలు లేకపోతే, వాటిపై విధించే ఛార్జీలను ఛాలెంజ్​ చేయొచ్చు.
  • ఫ్రాడ్​ : ఐడెంటిటీ థెఫ్ట్​, ఫిషింగ్ స్కామ్​లను గుర్తించే కార్డు జారీ చేసే సంస్థను వెంటనే సంప్రదించాలి.

క్రెడిట్​ కార్డు డిస్ప్యూట్​లు క్లెయిమ్​ చేసుకునే విధానం

1. క్రెడిట్ కార్డు జారీ చేసే సంస్థను సంప్రదించడం : ఏదైనా స్టేట్​మెంట్​లో సమస్యను గుర్తించే క్రెడిట్ కార్డు జారీ చేసే సంస్థను సంప్రదించాలి. మీ లావాలదేవీలకు సంబంధించి- తేదీ, అమౌంట్​, మర్చంట్​ సహా మొత్తం వివరాలు వారికి అందించాలి.

2. డిస్ప్యూట్​ ఫామ్​ను ఫైల్ చేయడం : క్లెయిమ్​ వివరాలను క్రెడిట్ సంస్థకు తెలియజేయడం కోసం ఒక డిస్ప్యూట్​ ఫామ్​ను నింపాల్సి ఉంటుంది. అయితే ఫామ్ సబ్మిట్​ చేసేటప్పుడు అన్ని వివరాలు పొందుపరిచారో లేదో చెక్​ చేసుకోవాలి.

3. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ : వినియోగదారులు క్లెయిమ్​ చేసిన తర్వాత సదరు క్రెడిట్ సంస్థ, దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తుంది. ఈ క్రమంలో స్టేట్​మెంట్​లో ఉన్న డిస్ప్యూటెడ్ అమౌంట్​ను తాత్కాలికంగా తొలగిస్తారు.

4. పరిష్కారం : ఇన్వెస్టిగేషన్ పుర్తైన తర్వాత కార్డు జారీ చేసే సంస్థ- వారు కొనుగొన్న వివరాలను మీకు తెలియజేస్తారు. అవి మీ క్లెయిమ్​కు అనుకూలంగా ఉంటే డిస్ప్యూటెడ్ అమౌంట్​ను మీ బ్యాంకు అకౌంట్​లో జమ చేస్తారు.

అయితే క్రెడిట్​ కార్డు చెల్లింపులు, ఛార్జీలు తదితర వాటిలో సమస్యలు గుర్తించే, ట్రాన్సాక్షన్ జరిగిన తేదీ నుంచి 180 రోజుల్లో డిస్ప్యూట్ లేవనెత్తే హక్కు ఉంటుంది. ఈ డిస్ప్యూట్​లు సాధారణంగా 45 నుంచి 60 రోజుల్లో పరిష్కారం అవుతాయని నిపుణులు చెబుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.