ఇళ్ల స్థలాలను ఆక్రమించేందుకు వైసీపీ నేత యత్నం - బాధితుల ఆవేదన - andhra pradesh
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 27, 2024, 12:17 PM IST
YSRCP Leader Land Encroachment: 40 ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన తమ ఇంటి స్థలాలను వైసీపీ నేత ఆక్రమించుకునేందుకు యత్నిస్తున్నారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం గ్రామీణ మండలం పరసన్నాయిపల్లిలో వెన్నపూస లక్ష్మీనారాయణమ్మ వద్ద నుంచి 4 సెంట్లు చొప్పున 78 మంది కొనుగోలు చేశారు. 4 దశాబ్దాలుగా స్థలాలు ప్లాట్ల యజమానుల ఆధీనంలోనే ఉన్నాయి. లక్ష్మీనారాయణమ్మ మృతి అనంతరం వైసీపీ నాయకుడైన ఆమె వారుసుడు తమపై దౌర్జన్యం చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు.
ప్లాట్ల ఓనర్లు ఏర్పాటు చేసుకున్న కంచె, సిమెంట్ స్తంభాలను అర్ధరాత్రి ధ్వంసం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. గతంలో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయగా, డీఎస్పీ భూ యజమానులను పిలిపించి హెచ్చరించారు. అయితే 9.31 ఎకరాల్లో 73 ప్లాట్లు తప్ప మిగతా భూమి తమదేనని, ఈ ప్లాట్ల యజమానులను ఇబ్బంది పెట్టమని చెప్పారు. అయితే పోలీసుల ఎదుట ఒప్పుకున్న దానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ తమకు నష్టం కలిగించారని ప్లాట్ల ఓనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ నాయకులు కావటం వల్ల పోలీసులు కఠినంగా వ్యవహరించటం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు.