LIVE: కడపలో వైఎస్ షర్మిల మీడియా సమావేశం - ప్రత్యక్షప్రసారం - YS Sharmila media conference - YS SHARMILA MEDIA CONFERENCE
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 3, 2024, 9:31 AM IST
|Updated : May 3, 2024, 9:41 AM IST
YS Sharmila Media Conference: ఎన్నికల ప్రచారంలో ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల దూసుకుపోతున్నారు. సీఎం జగన్పై విమర్శలు గుప్పిస్తున్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అన్ని వేళ్లు అవినాష్ రెడ్డి వైపే చూపిస్తున్నాయని వైఎస్ షర్మిలా ఆరోపించారు. గురువారం జమ్మలమడుగు నియోజకవర్గంలో షర్మిల బస్సు యాత్రలో పాల్గొన్న ఆమె సీఎం జగన్పై నిప్పులు చెరిగారు. రాముడికి లక్ష్మణుడు ఎలాగో వైఎస్ఆర్కి వివేకా అలా ఉండే వారని వైఎస్ షర్మిల గుర్తుచేశారు. వివేకా చనిపోయి 5 ఏళ్లు అయ్యిందని, ఎవరు చంపారో సీబీఐ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నా నిందితులను పట్టుకోవడంలో జాప్యం జరుగుతోందని వాపోయారు. చనిపోయింది వైఎస్ఆర్ తమ్ముడు, హంతకులను కాపాడుతున్నది జగన్ మోహన్ రెడ్డి అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అవినాష్ రెడ్డిని అరెస్టు చేయాలని చూస్తే కర్నూల్ లో కర్ఫ్యూ సృష్టించారని చెప్పారు. సీఎం జగన్ రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ను కూడా ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నారని షర్మిల ఆరోపించారు. ప్రస్తుతం కడపలో వైఎస్ షర్మిల మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు. ప్రత్యక్షప్రసారం.
Last Updated : May 3, 2024, 9:41 AM IST