ETV Bharat / state

తిరుపతి తొక్కిసలాట ఘటన - కేంద్ర హోంశాఖ సమీక్ష - CENTRAL GOVT FOCUS ON TTD INCIDENT

జనవరి 20వ తేదీన తిరుపతిలో సమీక్ష చేయనున్న హోంశాఖ అదనపు కార్యదర్శి సంజీవ్‌ - సమీక్షకు ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఛైర్మన్‌ను కోరిన కేంద్ర హోంశాఖ

Union Home Ministry Reviews Tirupati Stampede Incident
Union Home Ministry Reviews Tirupati Stampede Incident (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 18, 2025, 9:24 PM IST

Updated : Jan 18, 2025, 10:43 PM IST

Union Home Ministry Reviews Tirupati Stampede Incident : తిరుపతి తొక్కిసలాటపై కేంద్ర హోంశాఖ సమీక్ష చేయనుంది. ఘటనపై ఈ నెల 20న తిరుపతిలో కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ సమీక్ష చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే సమీక్ష కు ఏర్పాట్లు చేయాలని టీటీడీని కేంద్ర హోంశాఖ కోరింది. సమీక్ష కోసం కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి చెన్నై నుంచి తిరుపతి రానున్నారు.

తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార సర్వదర్శన టోకెన్ల జారీలో తీవ్ర విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అనూహ్యంగా భక్తులు తరలిరావడంతో తోపులాట చోటు చేసుకుంది. తిరుపతి నగరంలోని బైరాగిపట్టెడలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 48 మంది అస్వస్థతకు గురయ్యారు.

తొక్కిసలాటలో గవర్నర్​, సీఎంకు ఏం సంబంధం? - పిటిషనర్‌ను ప్రశ్నించిన హైకోర్టు

ఏం జరిగింది : వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుపతిలో 8 కేంద్రాల వద్ద స్లాటెడ్‌ సర్వదర్శనం టోకెన్ల జారీకి టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 10, 11, 12 తేదీలకు సంబంధించి మొత్తం 1.20 లక్షల టోకెన్లు జారీ చేయనున్నట్లు ప్రకటించారు. తొలుత గురువారం ఉదయం 5 గంటలకు టోకెన్లను జారీ చేస్తామని వెల్లడించారు. దీంతో వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కోసం బుధవారం ఉదయం నుంచే భక్తులు టోకెన్ల జారీ కేంద్రాలకు చేరుకున్నారు. బైరాగిపట్టెడలోని రామానాయుడు ప్రభుత్వ ఉన్నత పాఠశాల, సత్యనారాయణపురం జెడ్పీ హైస్కూల్‍, విష్ణునివాసం, శ్రీనివాసం, ఇందిరా మైదానం, రామచంద్రపుష్కరణి, ఎమ్మార్‍ పల్లి ప్రాంతాలకు భారీగా భక్తులు తరలివచ్చారు.

తిరుపతి ఘటన - ఇద్దరు అధికారులు సస్పెన్షన్ - ఎస్పీ, జేఈవో బదిలీ​

తొలుత జీవకోన వద్ద ఉన్న జిల్లా పరిషత్‌ హైస్కూల్​ వద్ద స్వల్ప తోపులాట జరిగింది. ఎస్పీ సుబ్బారాయుడు అక్కడికి వెళ్లి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. బైరాగిపట్టెడలోని రామానాయుడు ఉన్నత పాఠశాల వద్ద భారీగా తరలివచ్చిన భక్తులను సమీపంలో ఉన్న పద్మావతి పార్క్​లోకి తరలించారు. రాత్రి 8 గంటల 15 నిమిషాల సమయంలో పార్కులో ఉన్న ఒక వ్యక్తి అస్వస్థతకు గురవడంతో ఆయనకు వైద్యం అందించేందుకు అధికారులు గేట్లు తెరవబోయారు.

క్యూలైన్లలోకి వదిలేందుకే గేట్లు తెరిచారని భావించిన కొంతమంది భక్తులు ఒక్కసారిగా తోసుకుని ముందుకెళ్లే ప్రయత్నం చేశారు. అధిక సంఖ్యలో భక్తులు తోసుకుంటూ ముందుకు రావడంతో చాలామంది కిందపడిపోయారు. ఊపిరాడక పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే క్షత్రగాత్రులను రుయా, స్విమ్స్‌ ఆసుపత్రులకు తరలించారు. అస్వస్థతకు గురైన వ్యక్తి కోసం గేటు తెరిచేలోపే ఈ విషాదం జరిగిందని జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు.

తిరుపతి ఘటన - బాధితులకు పరిహారం అందజేయడానికి రెండు బృందాలు

Last Updated : Jan 18, 2025, 10:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.