పులివెందులలో వైఎస్ విగ్రహం కూడా కుంగి వంగిపోయింది! - YS Rajasekhara Reddy Statue
🎬 Watch Now: Feature Video
YS Rajasekhara Reddy Statue Damaged: ఓవైపు కట్టుకుంటూ పోతుంటే, మరోవైపు కూలిపోవడం, పెచ్చులూడిపోవడం వైసీపీ ప్రభుత్వంలో షరా మామూలుగా మారిపోయింది. వైసీపీ ప్రభుతంవ గెట్లు తెరిచి నీళ్లు వదిలిన తెల్లారే, ఆ గేట్లు మాయమవుతుంటాయి. అదేంటి అని అడిగితే ఆ పార్టీ నేతలు ఎదురుదాడికి దిగుతారు. తాజాగా వైఎస్ఆర్ కడప జిల్లాలో అలాంటి ఘటనే జరిగింది.
వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల మున్సిపాలిటీలోని సుందరీ కరణలో భాగంగా పలు అభివృద్ధి పనులు జరిగాయి. ఈ సందర్భంగా కదిరి రింగ్ రోడ్డు సర్కిల్లో మాజీ సీఎం, దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహంతో పాటుగా పలు విగ్రహాలను ఏర్పాటు చేశారు. వీటిలో కదిరి రింగురోడ్డులో ఏర్పాటుచేసిన వైఎస్సార్ విగ్రహం ఉన్నట్లుండి కింద పడిపోయింది. పడిపోయిన విగ్రహాన్ని పులివెందులకు చెంది వైసీపీ ప్రజాప్రతినిధులు తీసుకెళ్లారు. అయితే విగ్రహం ఏర్పాటు సమయంలో విగ్రహం కింది భాగంలో దృఢంగా నిర్మించలేదని, అక్కడి ఇనుప చువ్వలను చూస్తే తెలుస్తోంది. సుందరీకరణ అంటూ చకచకా చేపట్టిన పనులు అంతే తొందరగా శిదిలావస్తకు చేరుకున్నాయంటూ పులివెందుల ప్రజలు చర్చించుకుంటున్నారు.