LIVE : మంగళగిరిలో వైఎస్సార్ జయంతి వేడుకలు - ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి - Revanth LIVE From AP - REVANTH LIVE FROM AP
🎬 Watch Now: Feature Video
Published : Jul 8, 2024, 6:14 PM IST
|Updated : Jul 8, 2024, 8:06 PM IST
Revanth Reddy at YSR Birth Anniversary Celebrations 2024 : ఏపీలోని మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఏపీసీసీ ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి, మంత్రులను ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇటీవల హైదరాబాద్లో కలిసిన విషయం తెలిసిందే. తన తండ్రి రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలకు హాజరు కావాల్సిందిగా ఆమె వారిని ఆహ్వానించారు. ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నిర్వహిస్తోంది. ఈ సభకు జాతీయ నేతలతో పాటుగా తెలంగాణ, కర్ణాటక కాంగ్రెస్ నేతలు హాజరుకానున్నారు. మాణికం ఠాగూర్ ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలిపారు. ప్రస్తుతం మంగళగిరిలో రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు జరుగుతున్నాయి. ప్రత్యక్ష ప్రసారం.
Last Updated : Jul 8, 2024, 8:06 PM IST