నిండుకుండలా హుస్సేన్‌సాగర్ - లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు - Hussain Sagar Water Level Increased - HUSSAIN SAGAR WATER LEVEL INCREASED
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15-07-2024/640-480-21954624-thumbnail-16x9-sagar.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Jul 15, 2024, 1:06 PM IST
Hussain Sagar Water Level Increased : ఆదివారం కుండపోతగా కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ నగరంలోని హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. ఎగువ నుంచి పెద్ద ఎత్తున వరద నీరు సాగర్‌కు చేరుకోవడంతో తూము గేట్లు ఎత్తి నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జలాశయం ఫుల్ ట్యాంక్ లెవెల్ దాటింది. దీని పూర్తి స్థాయి నీటి మట్టం 514.75 మీటర్లు. ప్రస్తుతానికి నీటి మట్టం 513 మీటర్లు దాటింది.
ఎగువన కురుస్తున్న వర్షాలకు వరద నీరు మొత్తం హుస్సేన్ సాగర్‌లో చేరుతుంది. 4 గేట్ల నుంచి నీటిని బయటకు విడుదల చేస్తున్నారు. నీటి మట్టం పెరిగితే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై జీహెచ్ఎంసీ అధికారులు పరిశీలన చేశారు. రానున్న 24 గంటల్లో వర్షాలు కురిసే అవకాశమున్న నేపథ్యంలో ముంపునకు గురయ్యే దిగువన ఉండే కవాడిగూడ, మిగిలిన ప్రాంతాల ప్రజలను జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం చేశారు. ఇన్‌ఫ్లో ఎక్కువగా వస్తే, ఔట్ ఫ్లో కూడా ఎక్కువగా బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది.