ఆసుపత్రి ప్రాంగణంలోకి వరద నీరు - లోపలికి వెళ్లాలన్నా, బయటకు రావాలన్నా సిబ్బంది ఉండాల్సిందే - Flood Water Into Govt Hospital - FLOOD WATER INTO GOVT HOSPITAL

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Aug 31, 2024, 2:23 PM IST

Flood Water Entered in Jadcherla Government Hospital : మహబూబ్​నగర్​ జిల్లాలో తెల్లవారుజాము నుంచి భారీగా వర్షం కురుస్తుంది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. జిల్లాలోని జడ్చర్ల మండలం పరిధిలో ఉన్న వంద పడకల ఆసుపత్రి ప్రాంగణంలోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో ఆసుపత్రికి వచ్చే వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రి యాజమాన్యం గేటు సిబ్బందికి సూచనలిచ్చి, వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకుంటున్నారు. అవసరమైన పేషెంట్లను ఎత్తుకొని లోపలికి, బయట వదిలేస్తున్నారు. 

గతంలోనూ ఆసుపత్రిలోకి చాలాసార్లు ఇలా వర్షం నీరు వచ్చిందని స్థానికులు వాపోయారు. వర్షాకాలం వచ్చినప్పుడల్లా ఇలా నీరంతా ఆసుపత్రి ప్రాంగణంలోకి చేరడంతో రాకపోకలకు ఇబ్బందిగా ఉంటుందన్నారు. అది కూడా పచ్చని చెట్ల పక్కన నీరు ఆగుతుండటంతో అందులో ఏమున్నాయో, ఎక్కడ గుంతలు ఉన్నాయో తెలియడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. అధికారులకు ఈ సమస్యపై ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.