రానున్న ఐదేళ్లలో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా : కడియం కావ్య - Warangal Mp Kadiyam Kavya Press Meet - WARANGAL MP KADIYAM KAVYA PRESS MEET
🎬 Watch Now: Feature Video
Published : Jun 7, 2024, 3:33 PM IST
Warangal MP Kadiyam Kavya Press Meet : రానున్న ఐదేళ్లలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు కృషి చేస్తానని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. హనుమకొండలోని సీపీఐ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న పేదలందరికీ పట్టాలిప్పిస్తానని హామీ ఇచ్చారు. ప్రజలందరికీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వరంగల్ పార్లమెంటు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానన్నారు.
కాంగ్రెస్ పార్టీ విజయం కోసం పనిచేసిన కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలకు కడియం కావ్య ధన్యవాదాలు తెలిపారు. తన విజయంకోసం పనిచేసిన వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో పాటు సీపీఐ జిల్లా నాయకులు పాల్గొన్నారు. కాగా రాష్ట్రంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ తరపున వరంగల్ నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన కడియం కావ్య గెలుపొందారు.