నిమ్రా, నోవా ఇంజనీరింగ్ కళాశాలల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ - ఏడు నియోజకవర్గాల కౌంటింగ్‌కు పూర్తైన ఏర్పాట్లు - Counting Arrangements Complete - COUNTING ARRANGEMENTS COMPLETE
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 3, 2024, 1:45 PM IST
Vote Counting Arrangements Complete For NTR District: ఎన్టీఆర్ జిల్లాలో ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. జూపూడిలోని నిమ్రా, నోవా ఇంజనీరింగ్ కళాశాలల్లో విజయవాడ పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్లను లెక్కించనున్నారు. ఇప్పటికే మూడంచెల భద్రతా వ్యవస్థను పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. నిమ్రా కళాశాలలో మైలవరం, జగ్గయ్యపేట, విజయవాడ తూర్పు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపును అధికారులు చేపట్టనున్నారు.
అదే విధంగా పక్కనే ఉన్న నోవా కళాశాలలో విజయవాడ పశ్చిమ, విజయవాడ సెంట్రల్, తిరువూరు, నందిగామ నియోజకవర్గాల ఓట్లను లెక్కించనున్నారు. పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలకు ఒక్కొక్క రౌండ్‌కు 14 టేబుళ్ల చొప్పున లెక్కించనున్నారు. ఒక్క రౌండ్ పూర్తి అయ్యే సరికి అర్థగంట సమయం పడుతుంది. సాయంత్రం 5 గంటల్లోపు ఫలితాలను వెల్లడిస్తామని జిల్లా కలెక్టర్ కూడా చెప్పారు. పారదర్శకంగా కౌంటింగ్ ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ ఏజెంట్లు లెక్కింపు చేసేందుకు వీలుగా ఉండేలా తగిన ఏర్పాట్లు చేశారు.