ప్రభుత్వ స్థలంలో కౌన్సిలర్ నిర్మాణం - అడిగిన వారిపై ఐరన్​రాడ్​తో దాడి - కౌన్సిలర్ అక్రమ నిర్మాణాలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Feb 20, 2024, 8:09 PM IST

Video Viral Councillor Attack In Karimnagar : కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మున్సిపల్‌ పరిధి రామన్నపల్లిలో దారుణం చోటు చేసుకుంది. రామన్నపల్లి గ్రామ మూడో వార్డు కౌన్సిలర్ మేడిపల్లి రవీందర్ ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాన్ని చేపడుతున్నాడని అదే గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ప్రశ్నించారు. దీంతో ఆగ్రహించిన కౌన్సిలర్‌ ముగ్గురిపై ఇనుప రాడుతో దాడికి దిగాడు.

Councillor Attack In jammikunta : కౌన్సిలర్ రవీందర్ గ్రామంలోని సర్వే నెంబర్ 407 ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణం చేపడుతూ, బోర్ వేస్తున్నాడని అదే గ్రామానికి చెందిన మర్రి మల్లికార్జున్, కొలగాని రాజు, మేడిపల్లి మల్లయ్య అనే ముగ్గురు వ్యక్తులు ప్రశ్నించారు. దీంతో ఆగ్రహించిన కౌన్సిలర్‌ రవీందర్‌ అసభ్య పదజాలాన్ని ఉపయోగిస్తూ ఇనుప రాడుతో ఒక్కసారిగా ముగ్గురిపై దాడికి దిగాడు. మర్రి మల్లికార్జున్ అనే వ్యక్తికి తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. కాగా దాడికి గురైన వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, వెంటనే స్పందించిన పోలీసులు కౌన్సిలర్ రవిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ దాడినంతా అక్కడే ఉన్న స్థానికులు చరవాణిల్లో చిత్రీకరించడంతో వీడియో వైరల్ అవుతుంది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.