వరదలో బోటు బోల్తా - ఆరుగురిన రక్షించిన అగ్నిమాపక శాఖ సిబ్బంది - వీడియో వైరల్ - Video of Rescue Six People

🎬 Watch Now: Feature Video

thumbnail

Video of Rescue Six People were Drowning in Krishna River : కృష్ణానదిలో బోటు బోల్తాపడి కొట్టుకుపోయిన ఆరుగురిని గుంటూరు జిల్లా అగ్నిమాపకశాఖ సిబ్బంది రక్షించిన వీడియో ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. కృష్ణాజిల్లా తోట్లవల్లూరు నుంచి లంక గ్రామాలకు బయలుదేరిన బోటు కృష్ణానదిలో బోల్తా పడింది. నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో నీటిలో ఉన్న కరెంటు తీగలు కనిపించలేదు. తీగలు తట్టుకుని బోటు తిరగబడింది. ఆ బోటులో ఐదుగురు ప్రజలతో పాటు ఒక ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఉన్నారు. వీరు కొట్టుకుపోయే క్రమంలో చేతికి దొరికిన చెట్లను పట్టుకుని నది మధ్యలో ఉండిపోయారు. 

వారు కేకలు వేయటంతో సమీపంలోని వారికి వినిపించి అధికారులకు సమాచారం ఇచ్చారు. వారిచ్చిన సమాచారం మేరకు అన్నవరపులంక నుంచి అగ్నిమాపక సిబ్బంది బోటులో హుటాహుటిన వెళ్లారు. అక్కడ చెట్లు పట్టుకుని వేలాడుతున్న ఐదుగురిని రక్షించి బోట్లలో ఎక్కించుకుని నదిలో నుంచి బయటకు తీసుకువచ్చారు. వారికి అత్యవసర వైద్య సేవలు అందించి ఆసుపత్రికి తరలించారు. ఈ రెస్క్యూ ఆపరేషన్లో గుంటూరు జిల్లాకు చెందిన అగ్నిమాపక సిబ్బంది జీవీ సుబ్బారావు, జె.రుషి, ఎం.నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈనెల 2వ తేదిన జరిగిన ఘటనకు సంబంధించి వీడియోలు ఇప్పుడు బయటకు వచ్చాయి. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.