పవన్ కల్యాణ్ 'హోంమంత్రి' వ్యాఖ్యలు - మంత్రి నారాయణ ఏమన్నారంటే!
🎬 Watch Now: Feature Video
Minister Narayana Clarification On Deputy CM Pawan Kalyan Comments : రాష్ట్రంలో చిన్నారులపై జరుగుతున్న లైంగికదాడుల ఘటనల్ని సీరియస్ గా తీసుకోవాలని మాత్రమే పవన్ కల్యాణ్ పోలీసుల్ని ఆదేశించారని మంత్రి నారాయణ వెల్లడించారు. అంతేగాని హోంశాఖను ఆయన తీసుకుంటారని ఎక్కడా చెప్పలేదన్నారు. ఈ వ్యాఖ్యల్లో ఎలాంటి వివాదానికి తావు లేదని స్పష్టత ఇచ్చారు. సీఎంలు, డిప్యూటీ సీఎంలు సాధారణంగా ఏ విభాగాన్నైనా సరిగా చేయమని ఆదేశించవచ్చన్నారు. కొన్ని ఘటనల్లో న్యాయ, చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు పోలీసులకు ఇబ్బందులు ఉండొచ్చని తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వంలో ఎవరి మధ్యా పొరపొచ్చాలు లేవని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అందరినీ ఒకే తాటిపై నడిపిస్తున్నారని పేర్కొన్నారు.
అయితే కాకినాడ జిల్లా పర్యటనలో పోలీసు శాఖ పనితీరు, శాంతిభద్రతల అంశంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను హోంశాఖ బాధ్యతలు తీసుకుంటే పరిస్థితులు వేరుగా ఉంటాయని హెచ్చరించారు. క్రిమినల్స్ ను అణచివేసే ధైర్యం లేనప్పుడు పోలీసులు ఉండటం ఎందుకని ప్రశ్నించారు. సీఎంను చంపేస్తానని బెదిరించిన వ్యక్తిని పోలీసులు ఎందుకు వదిలేస్తున్నారని నిలదీశారు. ఇళ్లలోకి వెళ్లి మహిళలపై అత్యాచారం చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారో చెప్పాలన్నారు. గత ఐదేళ్లు అధికారంలో ఉన్న ప్రభుత్వం పనిచేయలేకపోవడం వల్లే ఈ పరిస్థితులు తలెత్తాయన్నారు.