Collector Takes Action on Warden And Teachers : విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన వార్డెన్, ఉపాధ్యాయులపై కలెక్టర్ చర్యలు తీసుకున్న ఘటన అల్లూరి జిల్లాలో చోటుచేసుకుంది. పాడేరు మండలం డోకులూరు గిరిజన సంక్షేమ పాఠశాలలో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. తరగతుల్లో విధులు నిర్వహించకుండా ఉపాధ్యాయులు డుమ్మా కొట్టడం, వార్డెన్ నిర్వహణ సరిగా లేకపోవడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు బయట తిరుగుతుండటంతో అసహనానికి గురయ్యారు. వార్డెన్‌ను సస్పెండ్ చేసి ముగ్గురు ఉపాధ్యాయులకు షోకాస్ నోటీసులిచ్చారు. తరచూ సెలవులు పెడుతున్న ఇంగ్లీష్‌ను మెడికల్ బోర్డుకి రిఫర్ చేశారు. విద్యా బోధన సరిగా లేకపోతే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ దినేష్ కుమార్ హెచ్చరించారు.
"ప్రిన్సిపాల్ వేధింపులు" - గురుకుల విద్యార్థుల 18 కి.మీ. పాదయాత్ర
సార్లూ మా ఊరికి రోడ్డు వేయండి - మంత్రి, కలెక్టర్‌కు చిన్నారుల విజ్ఞప్తి