Kollu Ravindra Comments on Liquor Prices Increase: జగన్ ప్రభుత్వం మద్యం డిపోలను తాకట్టు పెట్టి తెచ్చిన అప్పుల్లో రూ.13 వేల కోట్లు చెల్లించాల్సి ఉందని ఎక్సైజ్ శాఖా మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ హాయాంలో పెద్ద ఎత్తున మద్యం అక్రమాలు చేశారని మండిపడ్డారు. మద్యంలో జగన్ ప్రభుత్వం చేసిన తప్పుల్ని ఒక్కోక్కటిగా సరిదిద్దుకుంటూ వస్తున్నామని అన్నారు. గతంలో మద్యం నకిలీ బ్రాండ్లతోనూ రాష్ట్రంలో విక్రయాలు జరిపారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 150 కొత్త మద్యం బ్రాండ్లను విక్రయిస్తున్నట్లు వివరించారు.
ప్రభుత్వానికి రూ.100-150 కోట్ల ఆదాయం: మద్యం నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడేది లేదని మంత్రి కొల్లు తేల్చిచెప్పారు. అన్ని రకాల తనిఖీలు చేశాకే రాష్ట్రంలో మద్యం విక్రయాలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఏఈఆర్టీ ద్వారా బాటిల్‌కు రూ.10 రూపాయలు మాత్రమే పెంచామని మంత్రి వెల్లడించారు. ఈ పెంపు ద్వారా ప్రభుత్వానికి 100 నుంచి 150 కోట్ల రూపాయల వరకు ఆదాయం వస్తుందని, అదే సమయంలో రీటైలర్లకు కూడా మార్జిన్ పెరుగుతుందని అన్నారు. త్వరలో నవోదయం కార్యక్రమం ద్వారా అక్రమ మద్యాన్ని అరికడతామని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. వచ్చే ఏడాది నాటికి అక్రమ మద్య రహిత రాష్ట్రంగా ఏపీని మారుస్తామని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు.
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మద్యం డిపోలు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చింది. గత ప్రభుత్వం చేసిన అప్పుల్లో 12 వేల కోట్ల రూపాయలు చెల్లించాము. మరో 13 వేల కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. వైఎస్సార్సీపీ హయాంలో పెద్ద ఎత్తున మద్యం విక్రయాల్లో అక్రమాలు చేశారు. గతంలో మద్యం నకిలీ బ్రాండ్లతోనూ విక్రయాలు జరిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 150 కొత్త మద్యం బ్రాండ్లు విక్రయిస్తున్నాము. మద్యం నాణ్యత విషయంలోనూ ఎక్కడా రాజీపడేది లేదు. అన్ని రకాల తనిఖీలు చేశాకే మద్యం విక్రయించడం జరుగుతుంది. ప్రస్తుతం ఏఈఆర్టీ ద్వారా బాటిల్‌కు 10 రూపాయలు మాత్రమే పెరిగింది.- కొల్లు రవీంద్ర, మంత్రి
గిరిజనుల హక్కులు కాపాడతాం - 1/70 చట్టం తొలగించం: చంద్రబాబు
ఫైళ్ల వేగం పెంచాలి - సమస్యలు పరిష్కరిస్తేనే మంచి ఫలితాలు: సీఎం చంద్రబాబు