ETV Bharat / state

2025 నాటికి హైదరాబాద్​లోని చెరువులకు పూర్వవైభవం - బెంగళూరు తరహాలో పునరుజ్జీవం - HYDRA BANGALORE TOUR

బెంగళూరు తరహాలో చెరువులకు పునరుజ్జీవం కల్పించాలని హైడ్రా నిర్ణయం - 2025 నాటికి సుమారు 10 నుంచి 20 చెరువులకు పూర్వవైభవం

hydra_bangalore_tour
hydra_bangalore_tour (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 8, 2024, 8:43 PM IST

Hydra Bangalore Tour Over: బెంగళూరు తరహాలో సహజ పద్దతుల్లోనే నగరంలోని చెరువులకు పునరుజ్జీవం కల్పించాలని హైడ్రా నిర్ణయించింది. 2025 నాటికి సుమారు 10 నుంచి 20 చెరువులకు పూర్వవైభవం తీసుకురావాలని భావిస్తున్నారు. ఈ దిశగా బెంగళూరులోని ఉత్తమ విధానాలపై అధ్యయనం చేసిన హైడ్రా కమిషనర్ రంగనాథ్, లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఆనంద్ మల్లిగవడ్ పర్యవేక్షణలో పునర్జీవం పోసుకున్న పలు చెరువులను స్వయంగా పరిశీలించారు. తక్కువ ఖర్చుతో మంచి సతల్ఫితాలను తీసుకొచ్చిన కర్ణాటక ట్యాంక్ కన్జర్వేషన్ డెవలప్​మెంట్ అథారిటీకి అభినందనలు తెలిపారు. ఆనంద్ మల్లిగవడ్ సమక్షంలో హైదరాబాద్​లోని పలు చెరువులను కూడా సహజ సిద్ధంగా పునరుద్దరించేందుకు కృషి చేయనున్నట్లు రంగనాథ్ స్పష్టం చేశారు.

హైదరాబాద్ మహానగరంలో చెరువుల పునరుద్దరణ, విపత్తుల నిర్వహణపై అధ్యయనం కోసం రెండు రోజులపాటు బెంగళూరు వెళ్లిన హైడ్రా బృందం పర్యటన ముగిసింది. కమిషనర్ రంగనాథ్ నేతృత్వంలోని నలుగురు అధికారులతో కూడిన బృందం అక్కడి ఉత్తమ విధానాలను స్వయంగా పరిశీలించి హర్షం వ్యక్తం చేశారు. మొదటి రోజు ఎలహంకలోని కర్ణాటక నేచరుల్ డిజాస్టర్ మానిటరింగ్ సెంటర్​ను సందర్శించి అక్కడి సాంకేతిక పరిజ్ఞానం, వర్షాపాతం నమోదు, ఖచ్చితమైన సమాచారంతో ప్రజలను ముందస్తుగా అప్రమత్తం చేయడం లాంటి వివరాలను పరిశీలించారు.

బఫర్ జోన్స్​లో ఉన్న భూమి ప్రభుత్వానిదే: సమీపంలోని ఎలహంక, జకూర్ చెరువులను పునరుద్ధరించిన తీరును క్షేత్ర స్థాయిలో పరిశీలించి స్థానికుల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. రెండో రోజు పర్యటనలో భాగంగా కర్ణాటక ట్యాంక్ కన్జర్వేషన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులతో సమావేశమైన రంగనాథ్ నీటి వనరుల పరిరక్షణ కోసం తీసుకొచ్చిన కేటీసీడీఏ యాక్ట్ 2014ను పరిశీలించారు. ఎఫ్​టీఎస్​తో పాటు బఫర్ జోన్స్​లో ఉన్న భూమి మొత్తం ప్రభుత్వ భూమిగా పరిగణిస్తున్నామని సీఈవో రాఘవన్ రంగనాథ్​కు వివరించారు. అలాగే చెరువుల అభివృద్ధిలో డీపీఆర్​లు రూపకల్పన, సాంకేతిక బృందం అధ్యయనం, క్షేత్ర స్థాయిలో చేపడుతున్న పనులను రాఘవన్ సమగ్రంగా వివరించారు. చెరువుల ఆక్రమణల తొలగింపులోనూ కేటీసీడీఏ అనుసరిస్తున్న విధానాలను కూడా రంగనాథ్ అడిగి తెలుసుకున్నారు.

హైదరాబాద్ నగర సమస్యలపై హైడ్రా ఫోకస్ - వారు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే!

2025కి చెరువులు అభివృద్ధి: అనంతరం ఆనంద్ మల్లిగవడ్​తో కలిసి ఆయన చెరువులను పరిశీలించారు. దొడ్డతొగూరు చెరువును సందర్శించగా అక్కడ అత్యంత సహజ సిద్ధంగా చెరువులోకి వచ్చే మురుగునీరును శుద్ధి చేసే విధానం, చెరువు పునరుద్దణ విధానాలు, అందుకు అవుతున్న వ్యయాన్ని ఆనంద్ మల్లిగవడ్ వివరించారు. మల్లిగవడ్ సంస్థ చేపడుతున్న విధానాలపై హర్షం వ్యక్తం చేసిన రంగనాథ్ హైదరాబాద్​లోనూ అదే తరహాలో చెరువుల అభివృద్ధి కోసం కృషి చేయనున్నట్లు తెలిపారు. సహజ పద్దతల్లో చేపడుతున్న మురుగునీటి శుద్ధి ప్రక్రియ వల్ల అక్కడి చెరువుల్లో ఆక్సిజన్ శాతం పెరిగి జలచరాలు, పక్షులు, జీవవైవిధ్యం ఎంతో మెరుగుపడిందన్నారు. ఈ విధానాలను హైదరాబాద్​లోనూ అమలు చేసేలా ప్రభుత్వానికి సిఫారసు చేసి వచ్చే ఏడాది నాటికి 10 నుంచి 20 చెరువులను అభివృద్ధి చేయనున్నట్లు రంగనాథ్ వెల్లడించారు.

సోషల్​ మీడియా ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు: నీటి వనరుల పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా హైడ్రా లాంటి విధానాలను తీసుకురావాలని ఆనంద్ మల్లిగవడ్ సూచించారు. భవిష్యత్ తరాలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించాలంటే ఈ క్షణం నుంచే ముందడుగు వేయాలని పిలుపు నిచ్చిన ఆనంద్ మల్లిగవడ్ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. హైడ్రా నోటీసులు జారీ చేస్తుందంటూ జరుగుతుందన్న ప్రచారాన్ని రంగనాథ్ ఖండించారు. అక్రమ కట్టడాలపై హైడ్రా మళ్లీ దృష్టి సారించిందని, తాజాగా 50 మందికి నోటీసులు ఇచ్చారంటూ సామాజిక మాద్యమాల్లో సాగుతుందని అందులో ఎలాంటి వాస్తవం లేదని, ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రంగనాథ్ స్పష్టం చేశారు.

హైడ్రా ఫోకస్​ వారి పైనే - ఇక దూసుకుపోనున్న వాహనాలు

హైడ్రా ఎఫెక్ట్! - రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయానికి గండి - రూ.300 కోట్లు లాస్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.