ఏడుకొండలపై ఏడు అడుగుల పాము - షాక్​ అయిన ఉద్యాన సిబ్బంది

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 5, 2024, 7:10 PM IST

Updated : Nov 5, 2024, 7:31 PM IST

Seven Feet Snake Halchal in Tirumala : తిరుమలలో ఏడు అడుగుల పాము హల్ చల్ చేసింది. జీఎన్సీ వద్ద తితిదే నిర్వహణలో ఉన్న నర్సరీలో జెర్రీ పోతు పాము కనిపించింది. దీంతో అక్కడ పని చేస్తున్న ఉద్యానవన సిబ్బంది పామును చూసి భయబ్రాంతులకు గురయ్యారు. వెంటనే స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడుకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న భాస్కర్ నాయుడు అక్కడకు చేరుకున్నారు. అనంతరం పాము ఎటువంటి హాని కలగకుండా చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం మొదటి ఘాట్ రోడ్డులో సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదిలివేశారు.

Snake Bite a Devotee on the Alipiri Walkway in Tirumala : తిరుమల అలిపిరి నడకమార్గంలో జూలై 27న ఓ భక్తుడిని పాము కాటేసింది. చీరాలకు చెందిన వ్యక్తి అలిపిరి మెట్లమార్గంలో తిరుమలకు వెళ్తుండగా ఏడో మైలు వద్దకు వచ్చేసరికి ఒక్క సారిగా పాము కాటుకు (Snake Bite) గురయ్యాడు. వెంటనే అక్కడే ఉన్న భక్తులు అధికారులకు సమాచారం ఇవ్వడంతో అటవీశాఖ సిబ్బంది తిరుమల ప్రాంతీయ ఆస్పత్రికి బాధితుడిని తరలించి చికిత్స అందించారు.

Last Updated : Nov 5, 2024, 7:31 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.