Ex Minister Vidadala Rajini Fire on MLA Prathipati Pullarao : వైఎస్సార్సీపీ కార్యకర్తల జోలికి వచ్చే అధికారులు, టీడీపీ నేతల లెక్కలు తేలుస్తామని మాజీ మంత్రి విడదల రజని హెచ్చరించారు. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పై ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తనపై అక్రమంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించారని, దానిపై న్యాయ పోరాటం చేస్తానని రజని తెలిపారు. చిలకలూరిపేటలోని తన నివాసంలో విడదల రజని మీడియా సమావేశం నిర్వహించారు.
"నేను ఏ తప్పు చేయలేదు. బీసీ మహిళలని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. న్యూటన్ లా ప్రకారం చర్యకు ప్రతి చర్య కచ్చితంగా ఉంటుంది. మీ సంగతి తేలుస్తాం. దోచుకొని రిటైర్ అవ్వాలని చూసిన ఎక్కడ ఉన్న లాక్కొచ్చి వడ్డీతో సహా కట్టిస్తాం. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఎదుర్కొంటాం. పోరాటం చేస్తాం. తమ జోలికి వచ్చే వారిని వదిలిపెట్టాం" అని విడదల రజని హెచ్చరించారు. గత ఎన్నికల్లో చిలకలూరిపేట నియోజకవర్గాన్ని వదిలి వెళ్లిన రజని, వచ్చే 30 ఏళ్లు ఇక్కడే రాజకీయం చేస్తానని చెప్పుకొచ్చారు.
'నన్ను కొడుతుంటే విడదల రజిని చూసి ఆనందించారు' - ఎస్పీకి బాధితుడు ఫిర్యాదు
'5కోట్లు ఇస్తారా? 50 కోట్లు ఫైన్ వేయమంటారా?' - మాజీ మంత్రి రజిని, ఐఏఎస్ వాటాలు బహిర్గతం