ETV Bharat / state

జనవరి నుంచి ముఖ్యమంత్రి పాదయాత్ర - అక్కడి నుంచే ప్రారంభం - REVANTH REDDY PADAYATRA

జనవరి తొలివారం నుంచి పాదయాత్ర చేస్తానన్న తెలంగాణ సీఎం - మూసీ ప్రక్షాళనకు దుర్మార్గులు అడ్డొస్తున్నారని ధ్వజం

Telangana_CM_Revanth_Reddy
Revanth Reddy Padayatra: (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 8, 2024, 8:39 PM IST

Updated : Nov 8, 2024, 9:22 PM IST

Telangana CM Revanth Reddy Padayatra: వచ్చే ఏడాది జనవరి తొలివారం నుంచి పాదయాత్ర చేస్తానని తెలంగాణ సీఎం రేవంత్​రెడ్డి ప్రకటించారు. వాడపల్లి నుంచి పాదయాత్ర ప్రారంభిస్తానని రేవంత్ తెలిపారు. మూసీ నది కలుషితం కావడంతో రైతులు వ్యవసాయం చేయట్లేదని రేవంత్ రెడ్డి తెలిపారు. మూసీ ప్రక్షాళనకు దుర్మార్గులు అడ్డొస్తున్నారని, అడ్డుపడే వారిలో బీఆర్‌ఎస్‌ ముందుందని విమర్శించారు.

మూసీ పరివాహక ప్రాంతంలోని ఉత్పత్తులను ఎవరూ కొనట్లేదని, ఆ ప్రాంతంలో కల్లు సైతం అమ్ముకునే పరిస్థితి లేదని రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. మూసీ నదిలో చేపలు బతుకుతున్నాయా అని ప్రశ్నించారు. మూసీ నది ఒడ్డున పెంచిన గొర్రెలను సైతం కొనే పరిస్థితి లేదని రేవంత్ రెడ్డి అన్నారు.

2.5 కి.మీ పాదయాత్ర : మూసీ పునరుజ్జీవం కార్యక్రమాన్ని చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్న తెలంగాణ సీఎం రేవంత్​రెడ్డి, శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగెం నుంచి మూసీ పునరుజ్జీవ సంకల్ప పాదయాత్ర చేపట్టారు. సంగెం లోలెవల్ బ్రిడ్జి నుంచి ధర్మారెడ్డిపల్లి కాలువ మీదగా 2.5 కిలో మీటర్ల పాదయాత్ర చేశారు. అనంతరం కాలినడకన మూసీ పునరుజ్జీవ సభాస్థలికి రేవంత్ రెడ్డి చేరుకున్నారు. సంగెం గ్రామస్థులు, రైతులు పలు సమస్యలను సీఎం దృష్టికి తెచ్చారు. మూసీ నది వల్ల కలిగే సమస్యలను సీఎం రేవంత్ రెడ్డికి సంగెం గ్రామస్థులు వివరించారు.

అంతకుముందు సంగెం మూసీ నది ఒడ్డునున్న భీమలింగం వద్ద రేవంత్ రెడ్డి పూజలు చేశారు. మూసీ పునరుజ్జీవన సంకల్పయాత్రలో తెలంగాణ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్​రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, పొన్నం ప్రభాకర్​, కొండా సురేఖ పాల్గొన్నారు. సంకల్పయాత్రలో భారీ సంఖ్యలో కాంగ్రెస్ ​శ్రేణులు సైతం తరలివచ్చి, రేవంత్​రెడ్డి వెంట పాదయాత్ర చేశారు.

యాదాద్రి పేరు మార్పు : మరోవైపు అంతకముందు యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై అధికారులతో రేవంత్ రెడ్డి​ సమీక్షించారు. యాదాద్రి పేరును యాదగిరిగుట్టగా మార్చడంతో పాటు, యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు రేవంత్ వెల్లడించారు. టీటీడీ తరహాలో యాదగిరి టెంపుల్‌ బోర్డు ఏర్పాటు చేయాలని అధికారులను సూచించారు.

రేవంత్‌రెడ్డి మరో సంచలన నిర్ణయం - యాదాద్రి పేరు మార్పు

Last Updated : Nov 8, 2024, 9:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.