భద్రాద్రి రామయ్య ఆలయంలో వెండి వాకిలి - హర్షం వ్యక్తం చేస్తున్న భక్తులు - భద్రాద్రి ఆలయంలో వెండి వాకిలి
🎬 Watch Now: Feature Video
Published : Feb 8, 2024, 2:16 PM IST
Vendi Vakili Darshanam Launches In Bhadrachalam Temple: గోదావరి ఒడ్డున దక్షిణ అయోధ్యగా పిలిచే భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో వెండి వాకిలి దర్శనం బుధవారం ప్రారంభమైంది. ఆలయ ప్రవేశానికి మొత్తం 3 మార్గాలు ఉండగా, ఉచిత దర్శనం దారిలో ఇప్పటికే ఇత్తడి తాపడం ఉంది. అంతరాలయంలో బంగారు వాకిలి గతంలోనే ఏర్పాటు చేశారు. వీటి మధ్యలో ఉన్న ముఖ మండపానికి దాదాపు 100 కిలోల వెండితో తాపడం తయారు చేసి వాటిని ఈ మార్గానికి అమర్చారు. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ స్తపతి దండపాణి సారథ్యంలో శిల్పకళ ఉట్టిపడే విధంగా దీన్ని తయారు చేశారు.
Vendi Vakili Darshanam Bhadrachalam : కోవెలలో ఉన్న 70 కిలోల పాత రజతానికి తోడు హైదరాబాద్‌కు చెందిన దాత మరో 30 కిలోల వెండిని అందించారు. స్వామి వారి దశావతార ప్రతిరూపాలతో ఏర్పాటు చేసిన వెండి వాకిలి భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. భద్రాద్రిలో ఇకపై శుక్రవారం ప్రత్యేకతను సంతరించుకోనుంది. ఆ రోజు మూల విరాట్‌కు స్వర్ణ కవచాల అలంకరణ ఉంటుంది. అంతరాలయంలో పూజలు చేయించే వారు వెండి, బంగారు వాకిలి గుండా లోపలకు ప్రవేశించి మూలమూర్తులను దర్శించుకుంటారు.