30 అడుగుల మట్టి గణపతి - పర్యావరణహితానికే మొగ్గు చూపిన యువత - clay ganesh in vanasthalipuram
🎬 Watch Now: Feature Video
Published : Sep 7, 2024, 4:36 PM IST
Eco Friendly Ganesh in Vanasthalipuram : మట్టి గణపతినే పూజిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షించుకుందామని పిలుపునిస్తోంది హైదరాబాద్ వనస్థలిపురంలోని యువత. చవితి వేడుకల్లో ప్రతిసారి ప్రత్యేకతను చాటుకునే ఇక్కడి యువత, ఈ సంవత్సరం తమ ప్రాంతవాసులకు అవగాహన కల్పించేందుకు 30 అడుగుల మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను కాకుండా ఎకో ఫ్రెండ్లీగా వినాయక చవితి ఉత్సవాలను జరుపుకోవాలని నిర్ణయించుకున్నట్లు వనస్థలిపురం యువకులు చెబుతున్నారు. ఇందుకోసం కోల్‌కత్తా నుంచి కళాకారులను రప్పించి గంగమట్టితో బొజ్జ గణపయ్యను తయారు చేయించారు.
14 రోజుల పాటు పూజలు నిర్వహించి కొలువుదీరిన చోటే పర్యావరణహితంగా నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే వినాయక నవరాత్రుల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇక నుంచి ప్రతి సంవత్సరం మట్టి విగ్రహాలనే ప్రతిష్ఠిస్తామని, ఇందుకోసం కాలనీవాసులను అందరిని భాగస్వామ్యం చేస్తామని తెలుపుతున్నారు. ఈసారి ఇక్కడి ప్రాంతానికి చవితి వేడుకలు మరింతగా కొత్త కళను తీసుకొస్తాయంటోన్న వనస్థలిపురం యువతతో మా ప్రతినిధి ప్రత్యేక ముఖాముఖి.