LIVE : బీజేపీ కార్యాలయంలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి ప్రెస్మీట్ - Union Minister Kishan Reddy Live - UNION MINISTER KISHAN REDDY LIVE
🎬 Watch Now: Feature Video
Published : Jun 22, 2024, 4:38 PM IST
|Updated : Jun 22, 2024, 5:26 PM IST
Union Minister Kishan Reddy Live : కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో మీజియా సమావేశం ఏర్పాటు చేశారు. సింగరేణికి బొగ్గు గనుల కేటాయింపు విషయంలో ఆయన నిన్ననే ప్రకటన చేశారు. సింగరేణికి అన్యాయం జరగకుండా దిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడతానని ఆయన నిన్న ప్రకటన చేశారు. రాష్ట్రంలో బొగ్గు గనులు సింగరేణికి కేటాయించకుండా బహిరంగ వేలం వేయడంపై అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నాయి. ఈ విషయంలో అఖిలపక్షంతో దిల్లీ వెళ్లే యోచనలో ఉన్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇప్పటికే ప్రకటించారు. దీనిపై స్పందించిన బీజేపీ నేతలు సింగరేణికి అన్యాయం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం నిన్న ప్రకటించిన రుణమాఫీపై కూడా కిషన్ రెడ్డి మీడియా సమావేశంలో స్పందిస్తున్నారు. రుణమాఫీ ఎంత మందికి ఇస్తారు, ఎంత వరకు అర్హులనే విషయంలో ఇంకా స్పష్టత లేదని, ప్రభుత్వం వెంటనే స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. కిషన్ రెడ్డి మీడియా సమావేశాన్ని ఇప్పుడు ప్రత్యక్షంగా చూద్దాం
Last Updated : Jun 22, 2024, 5:26 PM IST