'నూతన న్యాయ చట్టాలపై కొందరివి కోడిగుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నాలు' - Kishan Reddy on New Laws - KISHAN REDDY ON NEW LAWS
🎬 Watch Now: Feature Video
Published : Jun 30, 2024, 10:55 PM IST
Union Minister Kishan Reddy Comments on New Laws in India : నూతన న్యాయ చట్టాలను వ్యతిరేకిస్తున్నా వారు కోడిగుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నాలు చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. నారాయణ గూడ కేశవ్ మెమోరియల్ కళాశాలలో నిర్వహించిన నేషనల్ థింకర్స్ వర్క్ షాప్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశమందరికి, అన్ని మతాల వారికి ఒకే న్యాయ చట్టం తెస్తే ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. నిర్మాణాత్మకంగా విమర్శలు చేస్తే సూచనలు చేస్తే స్వీకరిస్తామని తెలిపారు. అంతేగానీ బీజేపీ ఏది చేసినా వ్యతిరేకిస్తే తాము ఆ విషయాలను పట్టించుకోమని తెలిపారు. హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో పట్నా హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నర్సింహారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు, హైకోర్టు న్యాయమూర్తులు తదితరులు హాజరై తమ ఆలోచనలు పంచుకున్నారు. తర్వాత న్యాయవాదులు కిషన్ రెడ్డి సహా జస్టిస్ నర్సింహారెడ్డిని సత్కరించారు.