LIVE : బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉగాది పంచాంగ శ్రవణం - Ugadi celebrations at BJP office - UGADI CELEBRATIONS AT BJP OFFICE
🎬 Watch Now: Feature Video
Published : Apr 9, 2024, 11:56 AM IST
|Updated : Apr 9, 2024, 12:20 PM IST
Ugadi Celebrations at BJP Office in Hyderabad Live : ఉగాది పండుగ తెలుగువారి నూతన సంవత్సరం. ఇవాళ ఈ పండుగను పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అనంతరం పంచాంగ శ్రవణం ఆలకిస్తున్నారు. ఈరోజు చెప్పే రాశి ఫలాలను అందరూ ఎంతో శ్రద్ధగా వింటుంటారు.రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండగను చిన్నాపెద్దా అంతా కలిసి కట్టుగా చేసుకుంటున్నారు. ఈరోజు తీపి, కారం, వగరు, ఉప్పు, పులుపు, చేదు వంటి షడ్రుచులతో చేసిన ఉగాది పచ్చడిని సేవిస్తున్నారు. ఈరోజు తెలుగు నామ సంవత్సరంలో శోభకృత్ నామ సంవత్సరం నుంచి క్రోధి నామ సంవత్సరంలోకి అడుగుపెట్టాం. సామాన్య ప్రజలే కాకుండా రాజకీయ నేతలు కూడా ఉగాది సంబురాలు చేసుకుంటున్నారు. పార్టీ కార్యాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పంచాంగ శ్రవణం కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో పార్టీ శ్రేణుల ముందు పంచాంగ శ్రవణం కార్యక్రమం నిర్వహించారు. మరి మీరూ ఈ ఏడాది పంచాంగ వినేయండి.
Last Updated : Apr 9, 2024, 12:20 PM IST