LIVE : 'గేమ్ ఛేంజర్' ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ - ప్రత్యక్షప్రసారం - GAME CHANGER TRAILER LAUNCH LIVE

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Jan 2, 2025, 6:12 PM IST

Updated : Jan 2, 2025, 6:22 PM IST

Game Changer Trailer Launch Live :  గ్లోబల్ స్టార్ రామ్​చరణ్- శంకర్ కాంబోలో తెరకెక్కిన 'గేమ్ ఛేంజర్' ట్రైలర్ కాసేపటి క్రితం రిలీజైంది. హైదరాబాద్​ కొండాపూర్ AMB సినిమాస్​లో ఈవెంట్ నిర్వహించిన మేకర్స్​ ఈ ట్రైలర్​ను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి దర్శకధీరుడు రాజమౌళి చీఫ్ గెస్ట్​గా హాజరై ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అడ్వాణీ హీరోయిన్​గా నటించింది. అంజలీ, యస్​ జే సూర్య, శ్రీకాంత్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మ్యూజిక్ సెన్సేషన్​ తమన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర బ్యానర్​పై దిల్​రాజు భారీ బడ్జెట్​తో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ సినిమా రిలీజ్ కానుంది. దర్శకుడు శంకర్ తమిళ సినిమాను పాన్ ఇండియా సినిమాగా మలిచారని నిర్మాత దిల్ రాజు ప్రశంసించారు. దర్శకుడు రాజమౌళి తెలుగు సినిమాను గ్లోబల్ సినిమాగా తీసుకెళ్లారని.. రాజమౌళి, శంకర్​లు సినిమాను ఎక్కడికన్నా తీసుకెళ్లోచ్చనే ధైర్యాన్ని ఇచ్చారని కొనియాడారు. మేం ఏ సినిమా చేసినా ఆహ్వానించగానే వచ్చిన రాజమౌళికి దిల్ రాజు ధన్యవాదాలు తెలిపారు. మూవీ ట్రైలర్  రిలీజ్ ఈవెంట్​ను ప్రత్యక్షంగా చూద్దాం. 
Last Updated : Jan 2, 2025, 6:22 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.