రాజరాజేశ్వర స్వామి ఆలయంలో దొంగల బీభత్సం - హుండీ పగులగొట్టి నగదు చోరీ - THEFT IN YELLANDA TEMPLE TODAY - THEFT IN YELLANDA TEMPLE TODAY

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Apr 22, 2024, 1:56 PM IST

Theft In Warangal Rajarajeshwara Swamy Temple : వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ శివారులోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో దొంగలు పడ్డారు. ఆలయంలో ఉన్న హుండీని పగులగొట్టి నగదు అపహరించారు. గుడి నిర్వాహకుల ఫిర్యాదుతో సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇద్దరు వ్యక్తులు ఆలయంలోకి ప్రవేశించినట్లు సీసీ టీవీఫుటేజ్​లో గుర్తించారు. దొంగలు ఎక్కడి నుంచి వచ్చారు, ఎంత నగదు పోయిందనే కోణంలో విచారిస్తున్నారు. ఆదివారం రాత్రి ఇదే గ్రామంలో రెండు ద్విచక్ర వాహనాలు సైతం అపహరణకు గురికావడం పట్ల గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు.

గ్రామంలో దొంగల బెడద మొదలైందని స్థానికులు తెలిపారు. ఇలాంటి ఘటనలు జరగకుండా గ్రామ పెద్దలు, పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఊళ్లో ఉన్న మిగతా ఆలయాలపై కన్నేసి ఉంచాలని సూచించారు. గ్రామంలో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే, వెంటనే తమకు సమాచారం అందిచాలని పోలీసులు గ్రామస్థులకు తెలిపారు. నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని పోలీసులకు గ్రామస్థులు విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.