ఇళ్ల ముందు పార్క్ చేసిన 2 బైక్‌లు చోరీ - సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు - Two bikes stolen in Bhuvangiri - TWO BIKES STOLEN IN BHUVANGIRI
🎬 Watch Now: Feature Video
Published : Apr 4, 2024, 3:51 PM IST
Two Bikes Theft in Bhuvanagiri : యాదాద్రి భువనగిరి జిల్లాలో బైక్ దొంగలు రెచ్చిపోయారు. భువనగిరి పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఇళ్ల ముందు పార్క్ చేసిన రెండు బైక్‌లను చోరీ చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. చోరీ దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ చోరీకి సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
వివరాల్లోకి వెళితే, హౌసింగ్ బోర్డు కాలనీలో మంగళవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఇళ్ల ముందు పార్క్ చేసిన రెండు బైక్‌లను తస్కరించారు. అయితే ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితుడు బైక్‌ను దొంగిలించేందుకు ముందుగానే పథకం రచించుకున్నట్లుగా తెలుస్తోంది. కాలనీలోని ఓ ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ వద్దకు వెళ్లిన నిందితుడు, చోరీ చేసి దర్జాగా సొంత బైక్‌లా తీసుకుపోతున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. అయితే ఈ ఘటనకు సంబంధించి బాధితుల నుంచి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపడం కొసమెరుపు.