రామోజీకి ఫేమస్ షెఫ్ నివాళులు- అప్పుడు ETVతోనే కెరీర్ స్టార్ట్ చేసి, గిన్నిస్ రికార్డ్ సృష్టి - Tributes To Ramoji Rao - TRIBUTES TO RAMOJI RAO
🎬 Watch Now: Feature Video
Published : Jun 20, 2024, 5:32 PM IST
Tribute To Ramoji Rao By Chef : రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావుకు మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో ప్రముఖ షెఫ్ విష్ణు మనోహర్ నివాళులు అర్పించారు. స్వయంగా తానే హల్వా తయారు చేశారు. అన్ని పదార్థాలను సమపాళ్లలో కలుపుతూ హల్వాను వండారు. ఆ తర్వాత పువ్వులు వేసి రామోజీ రావు చిత్రపటం వద్ద అంజలి ఘటించారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో ఇప్పటికే స్థానం సంపాదించిన విష్ణు మనోహర్ షెఫ్‌గా తన ప్రయాణాన్ని ఈటీవీ మరాఠీ ఛానల్‌తో మొదలుపెట్టారు. 2002లో ప్రారంభమై కొన్నేళ్లపాటు సాగిన కుక్షోతో ఆయన ప్రముఖ షెఫ్‌గా గుర్తింపు సంపాదించుకున్నారు.
జూన్ 8వ తేదీన అనారోగ్యంతో రామోజీరావు కన్నుమూశారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడం వల్ల ఆయనను హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం (జూన్ 8వ తేదీ) తెల్లవారుజామున 4.50 గంటలకు తుదిశ్వాస విడిచారు. జూన్ 9వ తేదీ ఉదయం రామోజీరావు అంతిమ సంస్కారాలను తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో కుటుంబసభ్యులు నిర్వహించారు.