భారీ వర్షాలతో సరికొత్త శోభ - ఆకటుకుంటున్న ఎత్తిపోతల జలపాతం - Tourists in Ethipothala water Falls
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 20, 2024, 10:00 PM IST
Tourists are Coming to see Beauty of Ethipothala Water Falls : ఎత్తైన కొండలు, దట్టమైన అడవులు, పాల నురగల జలపాతాలు. ఆహా ఎంత బాగుందో కదా ఆ ఊహ. వర్షాలు వస్తే పోటెత్తే జలపాతాల అందాలను అలా చూస్తుంటే అలా ఎంత సమయమైనా అక్కడే ఉండిపోవాలి అనిపిస్తుంది కదా. ఎవరైనా సరే ఇట్టే ఆ జలపాతాల అందాలతో ప్రేమలో పడిపోతారు. అటువంటి జలపాతాలు ప్రకృతి ప్రేమికుల్ని మరెంతగానో కట్టిపడేస్తాయి. ఆ అందాలు ఇప్పుడు ఎక్కడో కాకుండా మన రాష్ట్రంలోనే దర్శనమిస్తున్నాయి.
అదే పల్నాడు జిల్లా మాచర్ల మండలంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ఎత్తిపోతల జలపాతం. ఇక్కడ ఎగువ ప్రాంతాల్లో కురస్తున్న భారీ వర్షాలతో జలపాతం సరికొత్త శోభను సంతరించుకుంది. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వరద ప్రవాహం ఎత్తిపోతల జలపాతానికి పోటెత్తింది. దీంతో 70 అడుగుల ఎత్తైన ఎత్తిపోతల జలపాతం నుంచి జాలు వారుతున్న వరద నీరు పర్యాటకుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. పరిసర వాగులు, అటవీ ప్రాంతంలోని వంకలు వరద నీటితో నిండి ఎత్తిపోతల జలపాతం వైపు దూసుకురావడంతో పచ్చటి ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. వారాంతం కావడంతో ఎత్తిపోతల జలపాత అందాలు చూసేందుకు సందర్శకులు, స్థానికులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.