దుర్గమ్మ గుడిలో చోరీ - తాళం తెరుచుకోట్లేదని హుండీనే ఎత్తుకెళ్లిన దుండగులు - Thieves Stole Hundi in Durga Temple - THIEVES STOLE HUNDI IN DURGA TEMPLE

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Jul 25, 2024, 12:33 PM IST

Thieves Stole Hundi In Durga Temple Sangareddy : చోరీకి పాల్పడ్డ దుండగులు హుండీని తెరవలేక ఏకంగా దాన్నే ఎత్తుకుపోయారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా నందిగామ గ్రామంలోని దుర్గమ్మ ఆలయంలో జరిగింది. ఆలయ నిర్వాహకులు తెలిపిన వివరాల మేరకు బుధవారం అర్ధరాత్రి నలుగురు దుండగులు ద్విచక్ర వాహనాల మీద ఆలయం వైపు వచ్చారు.  కాసేపు ఆయల పరిసరాల్లో తిరిగారు. ఎవరూ లేరని గమనించిన వారు గుడి లోపలికి వెళ్లారు. దేవాలయంలో ఉన్న హుండీని తెరవడానికి ప్రయత్నించారు. అది తెరుచుకోకపోయేసరికి ఏకంగా దాన్నే ఎత్తుకుని పోయారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డు అయ్యాయి. హుండీలో దాదాపు రూ.10వేల వరకు నగదు ఉంటుందని దేవాలయ నిర్వాహకులు చెప్పారు. ఇటీవల కాలంలో పట్టణంలో తరచూ చోరీలు జరుగుతున్నాయని స్థానికులు వాపోయారు. పోలీసులు పెట్రోలింగ్​ చేపట్టవలసిందిగా కోరారు. సీసీ కెమెరాలు పరిశీలించిన బీడీఎల్ భానూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.