మమ్మల్ని వదిలి వెళ్లకండి మాస్టారు - బదిలీపై వెళ్తున్న టీచర్ చుట్టూ వెక్కివెక్కి ఏడ్చిన విద్యార్థులు - Students Farewell to teacher
🎬 Watch Now: Feature Video
Published : Jul 2, 2024, 9:28 AM IST
Students Farewell to Teacher In Bhuvangiri District : గత కొన్ని సంవత్సరాలుగా వాయిదా పడుతు వస్తున్న ఉపాధ్యాయ బదిలీలు ముగిశాయి. ఈ సందర్భంగా ఏళ్ల తరబడి ఆయా పాఠశాలల్లో విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులు బదిలీపై వెళ్తున్నారు. ఈ సందర్భంగా స్కూల్ పిల్లలు మాత్రం మాస్టారు మమ్మల్ని వీడి వెళ్లద్దంటూ కన్నీటి పర్యంతం అవుతున్న సంఘటనలు చూస్తునే ఉంన్నాం. తాజాగా అలాంటి ఘటనే యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటు చేసుకుంది.
బదిలీపై వేరే పాఠశాలకు వెళ్తున్న గురువును చూసి విద్యార్థులు భావోద్వేగానికి గురైన సంఘటన భువనగిరి జిల్లా మోత్కూరు మండలం కొండగడపలో చోటుచేసుకుంది. ఇన్నాళ్లు తమ ఉన్నతి కోసం పరితపించి తరగతి పాఠాలే కాదు జీవిత పాఠాలు బోధించిన ఉపాధ్యాయుడి చుట్టూ చేరి తమను వీడి వెళ్లిపోవద్దంటూ వెక్కివెక్కి ఏడ్చారు. 11 ఏళ్లపాటు టీచర్ హనుమంతు చేసిన సేవలను స్థానికులు గుర్తుచేసుకున్నారు. పిల్లలంతా బడిలో చేరేలా ప్రోత్సహించారంటూ కొనియాడారు. ప్రతిరోజు పిల్లల ఆలనా పాలన చూసేవారని తెలిపారు. ఇంతకాలం తమ ఇంటి మనిషిలా పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకున్న మాస్టారు ఇప్పుడు వేరే ఊరికి వెళ్లడం బాధగా ఉందని గ్రామస్థులు పేర్కొన్నారు.