రైల్వే ట్రాక్‌పై పడుకుని ఆత్మహత్యాయత్నం - యువకుడిని కాపాడిన పోలీసు - POLICE SAVES A MAN FROM SUICIDE - POLICE SAVES A MAN FROM SUICIDE
🎬 Watch Now: Feature Video
Published : Aug 23, 2024, 1:07 PM IST
Mancherial Police Prevents A Man From Suicide : కుటుంబ సమస్యల కారణంగా రైలు పట్టాలపై ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంచిర్యాలో చోటుచేసుకుంది. గమనించిన స్థానికులు వెంటనే 100 కు ఫోన్ చేయడంతో డ్యూటీలో ఉన్న బ్లూ కోల్ట్ సిబ్బంది వచ్చి రక్షించడంతో ప్రమాదం తప్పింది.
ఇదీ జరిగింది : మంచిర్యాలలోని వాటర్ ట్యాంక్ ఏరియాకు చెందిన సాయికృష్ణ లారీ డ్రైవర్ గా జీవనాన్ని సాగిస్తున్నాడు. గత కొంత కాలంగా కుటుంబ సమస్యలు అతన్ని సతమతమయ్యేలా చేయడంతో సాయికృష్ణకు మరణమే శరణమని భావించాడు. స్థానిక ఏసీసీ సిమెంట్ కర్మాగారం సమీపంలో ఉన్న రైలు పట్టాలపై పడుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. గమనించిన స్థానికులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు చేరుకుని అతన్ని కాపాడారు. యువకుడికి కౌన్సిలింగ్ ఇచ్చి జీవితం పై అవగాహన కలిగించారు. వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసు సిబ్బందిని సిఐ బన్సీలాల్ రివార్డ్ అందించి అభినందించారు.