LIVE : శాసనమండలిలో బడ్జెట్‌పై చర్చ - legislative council Live

By ETV Bharat Telangana Team

Published : Jul 27, 2024, 10:03 AM IST

Updated : Jul 27, 2024, 8:43 PM IST

thumbnail
Legislative Council On Budget Live : తెలంగాణ శాసనమండలి సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. ఇవాళ్టి సమావేశాల్లో బడ్జెట్​పై వాడివేడి చర్చ జరగనుంది. అనంతరం పద్దుపై ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క సమాధానం ఇస్తారు. మొదటి రోజు సభలో ప్రశ్నోత్తరాలు, కొన్ని టేబుల్​ అంశాలపై సభలో చర్చించారు. అలాగే మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ డి. శ్రీనివాస్​ మృతిపై శాసనమండలి ఛైర్మన్​ గుత్తా సుఖేందర్​ రెడ్డి సంతాప తీర్మానం చదివి వినిపించారు. రెండో రోజు తెలంగాణ పూర్తిస్థాయి బడ్జెట్​ను శాసనమండలిలో శాసనసభ వ్యవహారాల శాఖ, ఐటీ మంత్రి శ్రీధర్​ బాబు ప్రవేశపెట్టారు. శాసనసభలో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. అంతకుముందు మంత్రిమండలి బడ్జెట్​కు ఆమోదం తెలిపింది. రూ.2,91,159 కోట్లతో రాష్ట్ర బడ్జెట్​ను రూపొందించారు. బడ్జెట్​లో వ్యవసాయ రంగం, సంక్షేమం, అభివృద్ధికి అధిక మొత్తం నిధులు కేటాయించారు. కాగా ఇవాళ శాసనమండలిలో బడ్జెట్‌పై చర్చా కార్యక్రమం ఉండనుంది. 28 ,29, 30 తేదీల్లో సమావేశాలకు సెలవు. 31వ తేదీన ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలపనున్నారు.  
Last Updated : Jul 27, 2024, 8:43 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.