తాండవ నది పరవళ్లు - ఆకట్టుకుంటున్న డ్రోన్ వీడియో - Thandava FLOOD FLOW VIDEO

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 3, 2024, 1:43 PM IST

thumbnail
భారీ వర్షాలకు పరవళ్లు తొక్కుతున్న తాండవ నది (ETV Bharat)

Thandava  Dam Gates Lifted :  రాష్ట్రంలో కురిసిన వర్షాల వల్ల జనజీవనం స్తంభించింది. వాగులు, వంకలు పొంగిపొర్లడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రాజెక్టుల్లోకి వరద చేరి నిండుకుండల్లా మారుతున్నాయి. మరోవైపు చాలా ప్రాంతాలు ఇంకా వరద గుప్పిట్లోనే అల్లాడుతున్నాయి. పలు ప్రాంతాల్లో నీటి ప్రవాహం తగ్గడంతో ఇవాళ కాస్త ఊపిరి పీల్చుకున్నాయి. మరోవైపు వేలాది ఎకరాల్లో పంటలు నీట మునగడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు.

ఈ క్రమంలోనే  కాకినాడ జిల్లా తుని, అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మీదుగా తాండవ నది పరవళ్లు తొక్కుతోంది. భారీ వర్షాలకు తాండవ రిజర్వాయర్​కు వరద పొటెత్తింది. దీంతో అధికారులు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. నాతవరం, కోనందూరు, తుని, పాయకరావుపేట మండలాల్లో పరవళ్లు తొక్కుతూ నది ప్రవహిస్తోంది. ఈ ప్రవాహ అందాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు నది పరివాహ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని చెప్పారు. నీటి ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.