AP Rain Alert : బంగాళాఖాతంలో శనివారం అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తూ సోమవారానికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం పేర్కొంది. ఆ తర్వాత రెండు రోజుల్లో తమిళనాడు - శ్రీలంక తీరాలవైపు వెళ్లొచ్చని తెలిపింది. దీని ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని వెల్లడించింది.
క్రమంగా తీవ్ర తుపానుగా : బుధ, గురు, శుక్రవారాల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అల్పపీడనం క్రమంగా తీవ్ర తుపానుగా రూపాంతరం చెందుతుందని కొన్ని వాతావరణ మోడళ్లు అంచనా వేస్తున్నాయి. తర్వాత అల్పపీడనంగా బలహీనపడి తమిళనాడులో తీరం దాటుతుందని సమాచారం. వర్షాల నేపథ్యంలో రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ తెలిపారు.
రానున్న 36 గంటల్లో అల్పపీడనం - రాష్ట్రంలో మూడు రోజులు వర్షాలు
బలపడిన అల్పపీడనం : ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న హిందూ మహాసముద్రంలో కేంద్రీకృతమైన అల్పపీడనం బలపడిందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి నవంబర్ 25న దక్షిణ బంగాళాఖాతం మధ్య భాగాలపై వాయుగుండం గా మారే అవకాశం ఉందని వెల్లడించారు. ఆ తర్వాత మరో 2 రోజుల్లో వాయువ్య దిశగా తమిళనాడు-శ్రీలంక తీరాల వైపు వెళ్లే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో ఈ నెల 27 నుంచి 30వ తేదీ వరకు కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. వర్షాల నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రైతులు పంట పొలాల్లో నిలిచిన అదనపు నీటిని బయటకు పోయేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాలలో ఉంచాలని, ఉద్యానవన పంట మొక్కలు/చెట్లు పడిపోకుండా నిలబడేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
గజగజ వణికిస్తొన్న చలి : రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గాయి. రాయలసీమలో ఉష్ణగ్రతల తగ్గదల స్వల్పంగా ఉంది. అయితే, పలు చోట్ల చలిగాలుల తీవ్ర పెరిగింది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఏజెన్సీలో చలి గజగజ వణికిస్తొంది. గత ఐదు రోజులుగా చలి ఎనిమిది డిగ్రీలకు చేరి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పాడేరులో వాహనదారులు ఉన్ని దుస్తులు ధరిస్తే గాని చలిని తట్టుకోలేని పరిస్థితి. ఉదయపు 10 గంటల వరకూ పొగ మంచు వీడటం లేదు. ఆ సమయం వరకు వాహనదారులు లైట్ల వెలుతురులోనే ప్రయాణిస్తున్నారు. కొన్నిచోట్ల పొగ మంచు జల్లులా కురుస్తోంది. అల్పపీడనం ప్రభావంతో రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరగవచ్చని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు.
"పాలధార పొంగినట్టుగా పాలకొండ జలపాతం" - చూసేందుకు ఎగబడుతున్న జనం
కరువు సీమలో కుండపోత - ఊళ్లను ముంచెత్తిన వరద - బుడమేరును తలపించిన పండమేరు