Minister Lokesh Fire On YSRCP Govt Debts in Lats Five Years : గత ఐదేళ్లలో జగన్ సృష్టించిన ఆర్థిక విధ్వంసానికి వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయ్యాయని మంత్రి నారా లోకేశ్ దుయ్యబట్టారు. అందినకాడికి అప్పులు చేశారని ఆరోపించారు. 58 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన ప్రభుత్వాలు చేసిన అప్పుపై 2019నాటికి రూ.14,155 కోట్లు వడ్డీ చెల్లిస్తున్నట్లు తెలిపారు. 2019 నుంచి 2024 వరకూ జగన్ సర్కార్ చేసిన అప్పులతో వడ్డీ భారం రూ.24,944 కోట్లకు పెరిగిందన్నారు. అందరు సీఎంలు చేసిన అప్పుపై కట్టిన వడ్డీ కన్నా ఐదేళ్లలో జగన్ చేసిన అప్పుపై కట్టే వడ్డీ సుమారు రూ.11 వేల కోట్లు ఎక్కువని చెప్పారు. జగన్ రెడ్డి సృష్టించి ఆర్థిక విధ్వంసానికి ఈ గణాంకాలే నిదర్శనమన్నారు.
రాష్ట్రంలో వైసీపీ ఐదేళ్ల పాలనలో జగన్ రెడ్డి సృష్టించిన ఆర్థిక విధ్వంసం అంతా ఇంతా కాదు.. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. అందినకాడికి అప్పులు చేశారు. 58 ఏళ్లపాటు అందరు ముఖ్యమంత్రులు కలిపి చేసిన అప్పుపై 2019 నాటికి రూ.14,155 కోట్లు వడ్డీ చెల్లిస్తుండగా... జగన్ రెడ్డి పాలించిన… pic.twitter.com/8y2vvPxtkR
— Lokesh Nara (@naralokesh) February 17, 2025
తప్పులు దొర్లితే సరిదిద్దుకుంటాం - ఏకపక్ష నిర్ణయాలుండవు: మంత్రి లోకేశ్
వాట్సప్ గవర్నెన్స్‌లో డేటా చౌర్యం నిరూపిస్తే 10 కోట్లు బహుమతి: లోకేశ్