ETV Bharat / state

వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్తే - ఏకంగా ప్రాణమే పోయింది - CHILD DIED IN NARASARAOPET

వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ బిడ్డ మృతి చెందాడని బంధువుల ఆరోపణ - ఆసుపత్రి ఎదుట ఆందోళన

Protest at Narasaraopet Private Hospital
Protest at Narasaraopet Private Hospital (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 17, 2025, 8:53 PM IST

Protest at Narasaraopet Private Hospital : ఆపరేషన్ కోసం ఆసుపత్రికి వెళ్తే ఏకంగా ఆ చిన్నారి ప్రాణాలే పోయాయి. వైద్యం వికటించి ఆ బాలుడు మరణించాడు. మరోవైపు బాబు చనిపోయాడన్న విషయం తమకు చెప్పకుండా ట్రీట్​మెంట్​ పేరుతో తమ దగ్గర డబ్బులు వసూలు చేశారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని వారు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఈ ఘటన పల్నాడు జిల్లా నరసరావుపేటలో చోటుచేసుకుంది.

దీనికి సంబంధించి బాలుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం బాపట్ల జిల్లా సంతమాగులూరుకు చెందిన విక్రమాదిత్య (3) అనే బాలుడు వినికిడి లోపంతో బాధపడుతున్నాడు. ఆదివారం నాడు ఆ చిన్నారిని నరసరావుపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. వైద్యులు బాలుడికి కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చేశారు. అయితే ఆపరేషన్ వికటించడంతో విక్రమాదిత్య మృతిచెందాడు. అయితే ఈ విషయాన్ని దాచిపెట్టిన వైద్యులు సాయంత్రం వరకూ వివిధ కారణాలతో ట్రీట్​మెంట్ చేస్తున్నట్లు కుటుంబ సభ్యులను నమ్మించారు.

Child Died in Narasaraopet : ఆదివారం రాత్రి బాలుడు మృతి చెందిన విషయాన్ని కుటుంబ సభ్యులకు వైద్యులు చెప్పారు. దీంతో వారు ఒక్కసారిగా షాక్​కి గురయ్యారు. అంతేకాక అరోగ్యశ్రీ అని చెప్పి రూ.50,000లు డిపాజిట్ చేయించుకుని బిల్లు కూడా ఇవ్వలేదు. ఆరోగ్యంగా ఉన్న బాలుడిని ఆపరేషన్ పేరుతో వైద్యులు పొట్టనబెట్టుకున్నారని బంధువులు వాపోయారు. కుమారుడి మృతితో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

ఇవాళ చిన్నారి మృతదేహంతో ఆసుపత్రి ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. దీంతో నరసరావుపేట-సత్తెనపల్లి ప్రధాన రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారికి సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. కానీ తమకు న్యాయం చేయాలంటూ ఆసుప్రతిలోకి వెళ్లేందుకు యత్నించారు. ఈ క్రమంలోనే పోలీసులు వారిని అడ్డుకున్నారు. అనంతరం వారికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. దీంతో గొడవ సద్దుమణిగింది. అనంతరం పోలీసులు ట్రాఫిక్​ను క్రమబద్దీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

వైద్యం వికటించి మహిళా కానిస్టేబుల్ మృతి..బంధువుల ధర్నా

వైద్యం వికటించి మహిళ మృతి.. ఆసుపత్రి ముందు బంధువుల ధర్నా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.