'బీఆర్ఎస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో ఎంతో నష్టపోయాం - వీఆర్వో వ్యవస్థను పునరుద్ధరించండి'
🎬 Watch Now: Feature Video
Telangana VROs Request Letter To Government : గత బీఆర్ఎస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో) వ్యవస్థ రద్దయ్యిందని తెలంగాణ వీఆర్వోల జాయింట్ యాక్షన్ కమిటీ ఛైర్మన్ గోల్కొండ సతీశ్ ఆవేదన వ్యక్తం చేశారు. వీఆర్వోలు అయిన తమను ఇతర శాఖలకు బదిలీ చేశారని, గత 18 ఏళ్లుగా ఎలాంటి ప్రమోషన్లు, సీనియారిటీ లేకుండా విధులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్ గాంధీభవన్లో ధరణి సంస్కరణల కమిటీ సభ్యుడు కోదండరెడ్డిని జేఏసీ సభ్యులు కలిసి వారి సమస్యలను వివరించారు.
ప్రభుత్వ భూముల పరిరక్షణకు రెవెన్యూ శాఖను బలోపేతం చేయాలన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన వీఆర్వో వ్యవస్థను, తిరిగి పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి కారణంగా భూ తగాదాలు ఎక్కువయ్యాయని, ధరణి వ్యవస్థను ప్రక్షాళన చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. వీఆర్వో వ్యవస్థను పునరుద్ధరించాలని, రెవెన్యూ వ్యవస్థ బలోపేతంతో పాటు ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా పని చేస్తామని గోల్కొండ సతీశ్ అన్నారు.