LIVE : కేబినెట్ భేటీపై మంత్రుల మీడియా సమావేశం - Telangana Ministers Live - TELANGANA MINISTERS LIVE
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/20-05-2024/640-480-21514438-thumbnail-16x9-ministers-live.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : May 20, 2024, 7:39 PM IST
|Updated : May 20, 2024, 8:14 PM IST
Telangana Ministers Live From Sachivalayam : కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వడంతో ఇవాళ రాష్ట్ర మంత్రి మండలి సమావేశం అయింది. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్ సాగు ప్రణాళిక, మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులు, విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే బడులు, కళాశాలల్లో చేపట్టాల్సిన పనులు తదితర అంశాలపై మంత్రివర్గం చర్చించింది. రైతు రుణమాఫీ, ఏపీ - తెలంగాణ మధ్య విభజన అంశాలపై కూడా చర్చించాలని భావించినప్పటికీ జూన్ 4 వరకు ఆ అంశాలు పక్కన పెట్టాలని ఈసీ ఆంక్షలు విధించింది. జూన్ 4 లోగా చేపట్టాల్సిన అత్యవసర పనులపై మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలని స్పష్టం చేసింది. రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల నిర్వహణలో పాల్గొంటున్న అధికారులు కేబినెట్ భేటీకి హాజరు కావద్దని కూడా ఈసీ తెలిపింది. ఈ మీటింగ్ జరిగిన అనంతరం మంత్రులు మీడియాతో సమావేశం అయ్యారు. కేబినేట్ మీటింగ్‌లో చర్చించిన అంశాలను తెలియజేస్తున్నారు.
Last Updated : May 20, 2024, 8:14 PM IST