LIVE : తెలంగాణ శాసనమండలి సమావేశాలు - LEGISLATIVE COUNCIL LIVE - LEGISLATIVE COUNCIL LIVE
🎬 Watch Now: Feature Video


Published : Jul 31, 2024, 10:19 AM IST
|Updated : Jul 31, 2024, 4:16 PM IST
Telangana Legislative Council On Budget 2024 -25 Live : తెలంగాణ శాసనమండలి సమావేశాలు జరుగుతున్నాయి. ఇవాళ్టి సమావేశాల్లో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ ప్రారంభమైంది. గత సభలో ప్రశ్నోత్తరాలు, కొన్ని టేబుల్ అంశాలపై సభలో చర్చించారు. రెండో రోజు తెలంగాణ పూర్తిస్థాయి బడ్జెట్‌ను శాసనమండలిలో శాసనసభ వ్యవహారాల శాఖ, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టారు. శాసనసభలో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. అంతకు ముందు మంత్రి మండలి బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. రూ.2,91,159 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను రూపొందించారు. బడ్జెట్లో వ్యవసాయ రంగం, సంక్షేమం, అభివృద్ధికి అధిక మొత్తం నిధులు కేటాయించారు. కాగా ఇవాళ శాసనమండలిలో బడ్జెట్‌పై చర్చా కార్యక్రమం ఉండనుంది. 28 ,29, 30 తేదీల్లో సమావేశాలకు సెలవుగా ప్రకటించారు. తాజాగా 31వ తేదీన ద్రవ్య వినిమయ బిల్లుకు శాసనమండలిలో చర్చ జరిపి పద్దుకు సభలోని సభ్యులు ఆమోదం తెలపనున్నారు.
Last Updated : Jul 31, 2024, 4:16 PM IST