యాదాద్రి శ్రీలక్షీనరసింహ స్వామివారిని దర్శించుకున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ - Telangana Governor Visited Yadadri - TELANGANA GOVERNOR VISITED YADADRI
🎬 Watch Now: Feature Video


Published : Aug 27, 2024, 11:52 AM IST
Telangana Governor Visited Yadadri : ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దర్శించుకున్నారు. గిరి సందర్శనకై ఉదయం కొండపైకి చేరుకున్న గవర్నర్‌కు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యతో పాటు అధికారులు, ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం జిష్ణుదేవ్ వర్మ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. గర్భాలయంలో గవర్నర్ ప్రత్యేక పూజలు నిర్వహించగా ఆలయ అర్చకులు వేదాశీర్వచనాలు అందించారు. అనంతరం ఆలయ ఈవో గవర్నర్ జిష్ణుదేవ్ శర్మకు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.
తర్వాత కొండపై అఖండ దీపారాధన, టెంకాయ కొట్టు స్థలాన్ని గవర్నర్ సందర్శించారు. నేటి నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాలో 3 రోజుల పాటు పర్యటించనున్న గవర్నర్ పలు పుణ్యక్షేత్రాలను, పర్యాటక ప్రాంతాలను సందర్శించనున్నారు. స్థానికంగా ఉండే అధికారులతో సమావేశాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, జిల్లా కలెక్టర్ హనుమంత్ కే.జండగే పాల్గొన్నారు.