రాజ్‌భవన్‌లో ఘనంగా తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలు - రాష్ట్ర ప్రజలకు గవర్నర్ శుభాకాంక్షలు - TG FORMATION DAY AT RAJ BHAVAN - TG FORMATION DAY AT RAJ BHAVAN
🎬 Watch Now: Feature Video
Published : Jun 2, 2024, 10:02 AM IST
Telangana Decade Celebrations at Raj Bhavan : తెలంగాణ ఏర్పడి ఇవాళ్టితో పది సంవత్సరాలు పూర్తైన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలను గవర్నర్ రాధాకృష్ణన్ ఘనంగా ప్రారంభించారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. పోలీసుల పరేడ్‌ను వీక్షించారు.
Governor Speech on Telangana Formation Day Celebrations : రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ధి వేడుకలు చేసుకోవడం సంతోషంగా ఉందని గవర్నర్ రాధాకృష్ణన్ అన్నారు. తెలంగాణ ప్రజలందరికీ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అవినీతి నిర్మూలనే మనందరి లక్ష్యమని పేర్కొన్నారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా రాష్ట్ర ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచంతో మన తెలంగాణ పోటీ పడుతోందని అన్నారు. విశ్వ వేదికపై తెలంగాణ సగర్వంగా నిలబడుతుంది ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు సచివాలయంలో రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా సీఎస్ శాంతికుమారి జాతీయ జెండాను ఆవిష్కరించారు.