LIVE : సార్వత్రిక ఎన్నికల కార్యాచరణపై సీఈవో వికాస్ రాజ్ ప్రెస్‌మీట్ - CEO Vikas Raj on MP Elections
🎬 Watch Now: Feature Video
Published : Mar 18, 2024, 4:05 PM IST
|Updated : Mar 18, 2024, 4:43 PM IST
Telangana CEO Vikas Raj on MP Elections Preparation Live : రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల నగారా మోగటంతో అధికార యంత్రాంగం చర్యలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా నిఘా విస్తృతం చేసి, రాష్ట్ర సరిహద్దులు మొదలు అన్ని జిల్లా సరిహద్దుల వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని తెలంగాణ సీఈవో వికాస్‌రాజ్ స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నగదు, మద్యం తరలింపు, నిల్వలపై నిఘా పెంచాలని ఆదేశించారు. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిన నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులు, ఎస్పీలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ఇటీవల నిర్వహించారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు కృషి చేయాలని, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ అధికారులకు సూచించారు. ఓటింగ్ శాతం పెంచేందుకు సమర్థవంతమైన వ్యూహాలను అనుసరించాలన్నారు. బలమైన ప్రజాస్వామ్యం కోసం ఓటర్ల భాగస్వామ్యం ఎక్కువగా అవసరమని సీఈవో తెలిపారు. దివ్యాంగులు, వృద్ధులు, ట్రాన్స్ జెండర్లు, సంచార జాతులు ఓటింగులో పాల్గొనేలా చేయాలన్నారు. గతంలో తక్కువ నమోదైన పోలింగ్ కేంద్రాల్లో రానున్న ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు.
Last Updated : Mar 18, 2024, 4:43 PM IST